Anupama Parameswaran- Rangasthalam: అనుపమ్ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నారంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.   

Anupama Parameswaran- Rangasthalam: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస హిట్లతో దూసుకపోతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది, తన సమాధానంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇంతకీ హీరోయిన్ అనుపమ ఏమన్నారంటే? 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కెరీర్‌లో మూవీ ఓ మైల్ స్టోన్ గా మారింది. అలాగే హీరోయిన్ సమంతకు స్టార్ హీరోయిన్ స్టేటస్ తీసుకవచ్చింది. అయితే.. గతంలో రంగస్థలం సినిమాలో మొదట రామలక్ష్మీ పాత్రకు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.

కొన్ని షెడ్యూల్స్ షూట్ కూడా చేశారు. అయితే, రంగస్థలంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రియాలిటీ చూపడం, చెరువులో దిగడం, బర్రెలు తోమడం వంటి సీన్లను చేయాల్సి ఉండడంతో అనుపమ ఆ పాత్రను రిజెక్ట్ చేసింది. తన ఇష్టానికి అనుగుణంగా చేయలేనని ఆ బ్యూటీ చెప్పింది. దీంతో అనుపమ పరమేశ్వరన్ స్థానంలో సమంతను తీసుకొన్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అనుపమ క్లారిటీ?

ఇటీవల హీరోయిన్ అనుపమ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అసలు నిజాన్ని బయటపెట్టారు. అనుపమ మాట్లాడుతూ.. “రంగస్థలం సినిమాకు ముందు నన్ను అప్రోచ్ చేశారు. నేను కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఆ తర్వాత నా ప్లేస్ లో వేరే హీరోయిన్ తీసుకున్నారు. మీడియా మాత్రం నేను సినిమా వదులుకున్నట్టే రాశారు. ఆ వార్త వల్ల నాకు ఆరు నెలలు వరకు కొత్త పని దొరకలేదు. కొత్త ఆఫర్లు రాలేదు ” అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ పాత్రలో నటిస్తే. ఆమె కెరీర్ మరోలా..

ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంటోంది. కార్తికేయ 2, టిల్లు స్క్వేర్, డ్రాగన్ వంటి సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంది. కానీ, ఇటీవల వచ్చిన పరదా సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, కిష్కిందపురి అనే కాన్సెప్ట్-ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. కిష్కిందపురి సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ షురూ అయ్యింది. తాజాగా ఈ ప్రయోషన్ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. రంగస్థలం లో రామలక్ష్మీ పాత్రపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

పాత్రకు ప్రాణం పోసిందిగా..

ఇదిలా ఉంటే.. రంగస్థలం మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఇరగదీశారు. ఇక సమంత.. రామలక్ష్మీ పాత్రలో ఎలా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రకు సమంత ప్రాణం పోసింది. ఆమె రియలిస్ట్ నటన, సన్నివేశానికి తగినట్టుగా భావోద్వేగాలను చూపడం ప్రేక్షకుల్ని మెప్పించింది. సమంత ఆ క్యారెక్టర్‌లో నటన, గ్లామర్ మిళితం చేసి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఇలా సమంత కెరీర్ లో రంగస్థలం సినిమా మైలురాయిగా నిలిచిపోయింది. నిజానికి, రామలక్ష్మీ పాత్రలో అనుపమ నటించి ఉంటే.. ఆమె కెరీర్ మరోలా ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.