సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో నటిస్తోన్న అనుపమ ఓ సీన్ లో ప్రకాష్ రాజు తో కలిసి నటించాలి. అయితే ఆ సమయంలో ఇద్దరికీ మధ్య చిన్న గొడవ జరిగిందని దీంతో అనుపమ స్పృహ తప్పి పడిపోయిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీన్ డెవెలప్మెంట్ కోసం ప్రకాష్ రాజు ఇలా చేస్తే ఇంకా బావుంటుందని అనుపమకి చెప్పే ప్రయత్నం చేశారట.

ఆమె నటన నచ్చక రెండు, మూడు సజెషన్స్ ఇచ్చినట్లు టాక్. దీంతో అప్పటికే కాస్త నీరసంగా ఉన్న ఆమె ప్రకాష్ రాజు తనతో కొంచెం గట్టిగా మాట్లాడడం తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయం బయటకి రావడంతో ఆమె సోషల్ మీడియాలో అవన్నీ రూమర్స్ అన్నట్లు ఒక పోస్ట్ పెట్టింది. తాజాగా ఆమె ఎందుకు పడిపోయిందనే విషయంపై క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ పెట్టింది.

''షూటింగ్ లో ఓ టెన్షన్ సీన్ లో నటిస్తున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. డైలాగ్ సరిగ్గా చెప్పలేక తడబడ్డాను. దీంతో ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ మళ్లీ చదివి నటించాలని అన్నారు. అప్పటికే చలి జ్వరం, లో బీపీతో బాధపడుతున్న నేను నీరసంతో స్పృహతప్పి పడిపోయాను. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను'' అంటూ వెల్లడించారు. రామ్ హీరోగా అనుపమ నటిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.