రంగస్థలంలో రామలక్ష్మి నేనే కానీ..!

First Published 2, Jul 2018, 10:45 AM IST
anupama parameshwaran about rangasthalam movie
Highlights

ఈ ఏడాదిలో విడుదలైన 'రంగస్థలం' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే

ఈ ఏడాదిలో విడుదలైన 'రంగస్థలం' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. ఆమెతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో సమంతాను రీప్లేస్ చేశారు. తాజాగా ఈ విషయంపై అనుపమ స్పందించింది. 

ప్రస్తుతం ఆమె నటించిన 'తేజ్ ఐ లవ్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో మీడియాతో ముచ్చటించిన  అనుపమ రంగస్థలంలో సినిమా గురించి ప్రస్తావించడం విశేషం. 'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం మొదట నన్నే సంప్రదించాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలకపోయాను. సినిమా చూసిన తరువాత ఆ పాత్రలో సమంతా చాలా బాగా నటించారనిపించింది. రామలక్ష్మి పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. అదే విషయాన్ని సుకుమార్ కి కూడా చెప్పాను' అంటూ వెల్లడించింది. 

అలానే రంగస్థలంలో సమంతా పాత్ర, మహానటిలో కీర్తి సురేష్ పాత్రను తెరపై చూసినప్పుడు నటిగా ఎంతో స్ఫూర్తి పొందుతుంటానని వెల్లడించింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తానని భాష విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని 'అ ఆ' సినిమా సమయంలో త్రివిక్రమ్ గారు తెలుగు నేర్పించడంతోభాషతో కూడా ఇబ్బంది లేకుండా పోయిందని స్పష్టం చేసింది.   

loader