దానికోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా: అనుపమ

Anupama Parameshwaran About her Dream Role
Highlights

సాధారణంగా హీరోయిన్లు నెగెటివ్ రోల్స్ లో కనిపించడానికి కాస్త ఆలోచిస్తారు. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయేమోనని కానీ అనుపమ మాత్రం తన డ్రీమ్ రోలే నెగెటివ్ క్యారెక్టర్ అని చెప్పడం విశేషం

మలయాళ 'ప్రేమమ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె నటించిన 'తేజ్ ఐ లవ్యూ' సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ అమ్మడు చేతిలో మరికొన్ని సినిమాలు ఉండడంతో వాటితో సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది. ప్రస్తుతం అనుపమ.. రామ్ హీరోగా తెరకెక్కుతోన్న 'హలొ గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తోంది.

అక్టోబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకొని నటిగా తెలుగు వారిని మెప్పించిన అనుపమ తన డ్రీమ్ రోల్ నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆమె అంతగా ఏ రోల్ కోసం ఎదురుచూస్తోందో తెలుసా..? అనుపమకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాలని వుందట.

ఆ తరహా కథలు  ఏ దర్శకుడు చెబుతాడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది అనుపమ. సాధారణంగా హీరోయిన్లు నెగెటివ్ రోల్స్ లో కనిపించడానికి కాస్త ఆలోచిస్తారు. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయేమోనని కానీ అనుపమ మాత్రం తన డ్రీమ్ రోలే నెగెటివ్ క్యారెక్టర్ అని చెప్పడం విశేషం. మరి అనుపమ కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడా చూడాలి!

loader