Prema Entha Maduram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొడుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు మార్చి 8 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మాన్సీ కి ఫోన్ చేసిన ప్రీతి మీకు ఒక బ్యాడ్ న్యూస్ అంటుంది. మళ్లీ ఏమీ చచ్చింది అంటూ చికాకు అడుగుతుంది మాన్సీ. కిడ్నాప్ అయిన అను సేఫ్ గా దొరికింది. మీ బ్రో ఇన్ లా సామాన్యుడు కాదు ఇన్ని టెన్షన్స్ మధ్యలో కూడా పులిలా వేటాడి జలంధర్ ని పసిగట్టాడు. వర్కర్స్ ఆపకపోయి ఉంటే ఈపాటికి చచ్చుండేవాడు.
అతని ఢీకొట్టాలనుకోవడం మన ఫూలిష్నెస్ అంటుంది ప్రీతి. మళ్లీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు అసలు నీకు ఓటమి లేదా, పదే పది రోజుల్లో మిమ్మల్ని రోడ్డుమీదికి తీసుకొస్తానన్నాను, నేను ఓడిపోయినట్లేనా అంటూ కోపంతో రగిలిపోతుంది మాన్సీ. మరోవైపు పనిలోకి వచ్చిన అనుని రెండు రోజుల నుంచి ఏమైపోయావ్ వర్క్ లోకి రాలేదు అంటుంది అంజలి.
ఒంట్లో బాగోక హాస్పిటల్ కి వెళ్ళాను మీకు ఇబ్బంది అయి ఉంటుంది అను. నా సంగతి పక్కన పెట్టు నీ గురించి ఏమన్నారో చెప్పు డెలివరీ డేట్ ఇచ్చారా అంటుంది అంజలి. స్కానింగ్ తీసి బేబీ హెల్త్ బానే ఉంది అని చెప్పారు అంటుంది అను. ఈ టైంలో టు డేస్ కాదు టోటల్గా రెస్ట్ అవసరం నువ్వు పనిమనిషి ఇంట్లో ఉండు శాలరీ నేనిస్తాను.
నీకు వీలైనప్పుడు వచ్చి నాతో కబుర్లు చెప్పు చాలు అంటుంది అంజలి. పర్వాలేదు మేడం డెలివరీ డేట్ దగ్గర పడినప్పుడు నేనే పని మానేస్తాను. అప్పటివరకు పని చేస్తాను నాకు కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అంటుంది. నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యు కానీ నీకు ఎప్పుడు డబ్బు అవసరమైనా నన్ను అడుగు అంటుంది అంజలి.
ఇలాగే ఇచ్చుకుంటూ పోతే నువ్వు కూడా తనలాగే నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకోవాల్సి వస్తుంది అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాన్సీ. ఏం మాట్లాడుతున్నావ్ అని కోపంగా అంటుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే మన స్టేటస్ పాడైపోతుంది అంటుంది మాన్సీ. నేను మనుషుల్లో స్టేటస్ చూడను అంటుంది అంజలి.
అర్హత లేని వాళ్ళకి అధికారం ఇస్తే నష్టమే వస్తుంది. ఆనందని ప్రాజెక్ట్ హెడ్ గా పెట్టావు మొదటి రెండు రోజులు చాలా యాక్టివ్ గా చేశాడు ఇప్పుడు ఏమైంది అంటుంది మాన్సీ. వర్కన్నాక ఏవో డిస్టబెన్స్ వస్తూనే ఉంటాయి. నాకు ఆనంద్ మీద గట్టి నమ్మకం ఉంది అంటుంది అంజలి. ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదు అంటుంది మాన్సీ. ఆనంద్ క్యాపిబిలిటీ నీకు తెలీదు.
వర్క్ ఫినిష్ అయిన తర్వాత తన క్యాపబిలిటీని అనుమానించినందుకు నువ్వే ఫీల్ అవుతావు అంటుంది అంజలి. ఈలోపు ఫోన్ రావటంతో బయటికి వెళుతుంది అంజలి. మీ ఆయనను పొగుడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అంటుంది పక్కనే ఉన్న అను తో. లేదు మీ ఓటమిని తలుచుకొని జాలి పడుతున్నాను అంటుంది అను.
గెలుపు ఎవరిదో.. ఓటమి ఎవరిదో త్వరలోనే తెలుస్తుంది అంటుంది మాన్సీ. జరిగే పనిని జరగనివ్వండి. పంతానికి పోయి మన కంపెనీకి నష్టం తీసుకురావద్దు అంటుంది అను. మన కంపెనీ కాదు నా కంపెనీ అంటుంది మాన్సీ. నా అని చెప్పుకోవడం కాదు నా అని ఫీల్ అయ్యి నిలబెట్టుకోవాలి అంటుంది అను. ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ చేస్తే కోపంతో కేకలు వేస్తుంది మాన్సీ.
ఏమైంది అని అంజలి అంటే.. నా కంపెనీ ఎంప్లాయ్ వర్క్ ఎంత వరకు వచ్చిందో చూడటం కోసం సైట్ కి వెళ్తే ఏమి చేయట్లేదు అట మీ ప్రాజెక్ట్ హెడ్ అంటూ ఫోన్ అంజలి కి ఇస్తుంది. అంజలి ఆర్యతో మాట్లాడి ఎందుకొచ్చిన గొడవ చెక్ చేసుకుని ఇవ్వండి అంటుంది. కుదరదు మేడం వాళ్ళిచ్చిన టైంకి ఇంకా సిక్స్ డేస్ టైం ఉంది ఫైవ్ డేస్ తర్వాత రమ్మనండి అప్పుడు ఆలోచిస్తాను.
ఈలోపు ఇన్ఫెక్షన్ అంటే ఊరుకోను. ఒకసారి రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పిన తర్వాత మీ మాట కూడా నేను వినను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆర్య. ఏమైంది అని మాన్సీ అడిగితే మా గురూజీ చాలా టఫ్ అంటుంది అంజలి. ఐ డోంట్ లైక్ ఇట్ అంటే బట్ ఐ లైక్ ఇట్ మాటలు చెప్పే వాళ్ళు కన్నా చేతల్లో చేసే వాళ్ళనే నేను నమ్ముతాను.
అతను కచ్చితంగా ఇన్ టైం లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అంటుంది అంజలి. డెడ్లైన్ లోపు వర్క్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతుంది మాన్సీ. ఇంత ఆటిట్యూడ్ ఉన్న అమ్మాయిని ఎలా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా భరిస్తున్నారో అనుకుంటుంది అంజలి. సైట్ కి వచ్చిన అంజలి, ఆనంద్ ఎక్కడ వర్క్ చెక్ చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అందరూ వస్తున్నారు.
వర్క్ కంప్లీట్ అయినట్టే కదా అని యాదగిరిని అడుగుతుంది. సైట్ ని తన కంట్రోల్ లో పెట్టుకొని వారం రోజుల నుంచి నన్ను ఇటువైపుకే రానివ్వలేదు అయినా 30 మంది వర్కర్స్ ని పెట్టుకొని అంత పని కంప్లీట్ చేయడం చాలా కష్టం అందుకే తలుపులు మూసుకొని వెళ్లి పడుకోనుంటాడు అంటాడు యాదగిరి. ఇక్కడ నిలబడి గెస్సింగ్ చేసే బదులు ఆనంద్ కోసం ఎవరినైనా పంపించవచ్చు కదా అంటుంది అంజలి.
యాదగిరి ఫోన్ అందుకోసం వెళ్తాడు. అంతలోనే అక్కడికి నీరజ్ దంపతులు వస్తారు. గేటు బయట ఉన్న అంజలిని మీ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో చూపించరా అంటుంది మాన్సీ. వై నాట్ ప్రాజెక్ట్ హెడ్ కోసం వెయిటింగ్ అంటుంది అంజలి. అంతలోనే అక్కడికి వచ్చిన యాదగిరి ఆనంద్ ని తీసుకురమ్మని మనిషిని పంపించాను అంటాడు.
తనని తొందర పెట్టొద్దు అంటాడు నీరజ్. ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావ్ వర్క్ ఇన్ కంప్లీట్ గా ఉందా అని అడుగుతుంది మాన్సీ. ఆనంద్ మీద నమ్మకంతో నేను వర్క్ మీద పెద్దగా కాన్సెంట్ చేయలేదు. అందుకే ఆనంద్ వచ్చిన వరకు ఫుల్ డీటెయిల్స్ తెలీవు అంటుంది అంజలి. అందుకే ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకూడదు అంటుంది మాన్సీ.
అంజలి అంత గట్టిగా నమ్మింది అంటే అతని వర్క్ క్యాపిబిలిటీ ఏంటో అంచనా వేయొచ్చు, తొందరపడి కామెంట్స్ పాస్ చేయొద్దు అని మాన్సీ కి చెప్తాడు నీరజ్. మరోవైపు అను కి పాలు ఇచ్చి తాగమంటాడు. ఆమె పొద్దు పని మారం చేస్తుండటంతో మందలిస్తుంటాడు ఆర్య. అంతలో అక్కడికి వచ్చిన వ్యక్తి నీరజ్ సార్ వాళ్ళు సైట్ చూడ్డానికి వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్తాడు.
వస్తాను అని చెప్పి అది వ్యక్తిని పంపించేసి దగ్గరుండి టాబ్లెట్స్ వేయించి నువ్వు రెస్ట్ తీసుకో నేను వర్క్ దగ్గరికి వెళ్లి వస్తాను అని వెళ్ళిపోతాడు ఆర్య. మరోవైపు వర్కర్స్ స్ట్రైక్ సైట్ ఇంజినీర్స్ మధ్యలో కొంతమంది రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటుంది అంజలి. అది నీ ప్రాబ్లం మాకు నీ ఎక్స్ప్లనేషన్ ఎందుకు వరకు కంప్లీట్ అవ్వటం ముఖ్యం అంటుంది మాన్సీ.
ఆర్య మీద యాదగిరి కేకలు వేస్తుంటే వెయిట్ చేసిన మాకు లేని ప్రాబ్లమ్స్ నీకెందుకు అంటూ యాదగిరి ని మందలిస్తాడు నీరజ్. ఇది వాళ్ల ప్రాబ్లం మధ్యలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటుంది మాన్సీ. కంపెనీ ఎవరిదైనా రెస్పెక్టికల్ గా డీల్ చేయడం ముఖ్యం అంటాడు నీరజ్. వర్క్ ప్రోగ్రెస్ గురించి చెప్పండి మేమందరినీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అంటాడు నీరజ్.
నాకు టెన్షన్ గా ఉంది యాదగిరి వర్క్ అవలేదని చెప్తున్నాడు అంటుంది అంజలి. ఆర్య ఏమి మాట్లాడకుండా గేట్ ఓపెన్ చేస్తాడు. అక్కడ వర్క్ ఫినిష్ అయి ఉండడం చూసి నీరజ్ అంజలి హ్యాపీగా ఫీల్ అయితే మాన్సీ మాత్రం కోపంతో రగిలిపోతుంది. సైట్ ఇంజినీర్స్ లేకుండా వర్క్ ఎలా కంప్లీట్ అయింది అని ప్రీతిని అడుగుతుంది.
నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది ప్రీతి. ఇన్ టైంలో వరకు కంప్లీట్ అయినందుకు అంజలికి కంగ్రాట్స్ చెప్తాడు నీరజ్. యు హావ్ ఏ గుడ్ టీం అండ్ గుడ్ టీం లీడర్ అంటాడు. అక్కడే ఉన్నా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా ఇంత తక్కువ టైంలో ఇంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు. ఇంత తక్కువ టైంలో ఇదంతా ఎలా సాధ్యమైంది అని వాళ్ళు అడిగితే ఇదంతా మా ఆనంద్ క్రెడిట్ అంటుంది అంజలి.
సైట్ ఇంజినీర్స్ కూడా తక్కువగా ఉన్నారు ఇంత తక్కువ మందితో ఎలా సాధ్యమైంది అంటారు వాళ్లు. మీరు అన్నట్లుగానే కనిపించే వర్కర్స్ తో ఈ వర్క్ కొద్ది రోజుల్లో కంప్లీట్ అయింది కాదు ఐ హావ్ మై బ్యాకప్ ఫోర్స్ అంటూ పాత సైట్ ఇంజనీర్స్ అందర్నీ పిలుస్తాడు. వాళ్లని చూసిన మాన్సీ షాక్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపుటి ఎపిసోడ్ లో చూద్దాం.
