రవితేజ సినిమా నుండి తప్పుకుందట!

anu emmanuel won't be a part of raviteja's film
Highlights

వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోన్న హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్

వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోన్న హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ ఇప్పుడు ఓ సినిమా నుండి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రవితేజ హీరోగా నటించనున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో ముందుగా అనుని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె పూజా కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. కానీ ఇప్పుడు సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు.

''దురదృష్టవశాత్తు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నేను భాగం కాలేకపోతున్నాను. శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో డేట్స్ క్లాష్ అవుతుండడంతో రవితేజ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా టీమ్ కు నా శుభాకాంక్షలు'' అంటూ అను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

నిజానికి అను ఎమ్మాన్యుయల్ చేతిలో ప్రస్తుతం ఉన్నవి ఈ రెండు సినిమాలే. హీరోయిన్లు అందరూ ఒకేసారి రెండు, మూడు సినిమాలకు డేట్స్ కేటాయిస్తుంటే అను మాత్రం ఉన్న సినిమాను కూడా వదులుకుంది. దీనికి ఇతర కారణాలు ఉండి ఉంటాయని డేట్స్ సమస్య మాత్రం కాదని చెప్పుకుంటున్నారు. మరి అను స్థానంలో ఏ హీరోయిన్ ను తీసుకుంటారో చూడాలి!

 

loader