అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఇచ్చే పురస్కారం ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఈ ఏడాది రాజమౌళిని వరించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ప్రకటించిన సినీ నటుడు నాగార్జున

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అందించే పురస్కారం.. ఏఎన్ ఆర్ నేషనల్ అవార్డు. . తెలుగు సినీ పరిశ్రమకు కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ అవార్డు దర్శకధీర రాజమౌళిని వరించింది. రాజమౌళి.. బాహుబలి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును రాజమౌళికి అందజేస్తున్నట్లు సినీ నటుడు నాగార్జున తెలిపారు. రాజమౌళికి ఈ అవార్డు ప్రకటించడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన వివరించారు.

2006వ సంవత్సరం నుంచి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి సంవత్సరం ఈ అవార్డుని బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవీలు కూడా అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇఫ్పుడు తాజాగా వీరి జాబితాలో రాజమౌళి కూడా చేరారు.