అతిలోక సుందరి శ్రీదేవిది సహజ మరణమా? అసలు ఏం జరిగింది? దుబాయ్ హోటల్‌లో ఎవరెవరున్నారు? చివరి మినిట్‌లో ఏం జరిగింది? ఆ సమయంలో ఆమె ఫ్యామిలీ సభ్యులు ఎక్కడున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది అభిమానులను వెంటాడుతున్నాయి. మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి నాలుగు రోజుల కిందటే ఫ్యామిలీ మొత్తం రస్‌‌అల్‌ ఖైమాకు చేరుకున్నారు. 20న పెళ్లి తతంగం ముగిశాక కపూర్‌ ఫ్యామిలీసభ్యులు తిరుగు పయనమయ్యారు. బోనీ కుటుంబం అక్కడి నుంచి దుబాయ్‌కి వచ్చి షాపింగ్‌ నిమిత్తం జుమేరియాలోని ఎమిరేట్స్‌ టవర్స్‌ హోటల్‌లో బస చేసిందిముంబైలో తన ఫ్రెండ్ కూతురు బర్త్‌డే వేడుక ఉండడంతో ఫిబ్రవరి 22న బోనీకపూర్‌ ఇండియాకు చేరుకుని.. శనివారం మళ్లీ దుబాయ్‌కి వెళ్లాడు. ఈ రెండురోజులు శ్రీదేవి ఒక్కరే హోటల్‌లోనే వున్నారు.. కనీసం బయటకు కూడా రాలేదు. శ్రీదేవి హఠాన్మరణానికి ముందు భర్త బోనీకపూర్ ఆమెని ‘సర్‌ప్రైజ్’ చేయాలని ప్లాన్ చేశాడు. శనివారం ఈవెనింగ్ శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని భావించాడట భర్త బోనీ. ఈ విషయం ఆమెకి ముందే చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. డిన్నర్‌కు ముందు నిద్రపోతున్న శ్రీదేవి లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఈలోగా శ్రీదేవి వాష్‌రూమ్‌కి వెళ్లింది.. 15 నిమిషాలు గడిచినా బయటకు రాలేదు. దీంతో బోనీకపూర్ తలుపు కొట్టడంతో ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బలవంతంగా తలుపు ఓపెన్ చేసేసరికి బాత్‌టబ్‌లో కదల్లేని స్థితిలో కనిపించింది శ్రీదేవి. దీని తరువాత పోస్టుమార్టంకి పంపారు.ఇవాళ పోస్టమార్టం రిపోర్టు వచింది.వాటర్ టబ్ లో పడి మృతి చెందినట్లు రిపోర్ట్ వచ్చింది.అదే సమయంలో గుండె పోటు వచ్చి, టబ్లో పడి చనిపోయింతుందని తేల్చారు.