Asianet News TeluguAsianet News Telugu

అన్నా హజారే ప్రధాన పాత్రలో  తెలుగు దర్శకుడి సినిమా  "బచ్చె కచ్చె సచ్చె"

  • ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రధాన పాత్రలో బచ్చె సచ్చె కచ్చే సినిమా
  • తెలుగు దర్శకుడు రవి సదాశివ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
  • ఆర్థిక నేరాలను ఎలా అరికట్టాలో చెర్పే సందేశాత్మక చిత్రం

 

anna hazare lead role in bache kache sache directed by telugu person ravi

నేటి తరం చిన్న పిల్లలు ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడతారు. ఎప్పుడైనా నిజాలే మాట్లాడతారు. మరీ అలాంటి వారు నేడు సోసైటీ లో నెలకొన్న అపరిశుభ్రత, అంటరానితనం, ఆర్దిక నేరాలను ఎలా అరికట్టారన్న కథాశంతో తెరకెక్కుతోన్న చిత్రమే" బచ్చె కచ్చె సచ్చె" . హిందీ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 2 విడుదల కానుంది. గతంలో తెలుగులో అధినేత, సరదాగా కాసేపు లాంటి సినిమాలను నిర్మించిన రవి సదాశివ్ స్వీయ దర్శకత్వంలో "బచ్చె కచ్చెసచ్చె " చిత్రాన్ని తెరకెక్కించారు.

 

ఆశిష్ విద్యార్ది, ముఖేష్ తివారి ప్రధాన పాత్రల్లొ నటించిన ఈ సినిమాలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం ఓ ఇంపార్టెంట్ రోల్ లో కన్పించనున్నారు.  ఈ సందర్బంగా దర్శకుడు రవి మాట్లాడుతూ... నేటి జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్.  తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారివారి పిల్లల మాటలే వినాల్సి వస్తొంది. మరి అలాంటి కిడ్స్ మన సోసైటీలొ నెలకొన్న కొన్న సామాజిక రుగ్మతలను ఎలా అరికట్టారన్న కధాంశంతో బచ్చె కచ్చె సచ్చె సినిమాను తీశాము. రియాలిటీ కి దగ్గరగా ఉండే చిత్రమిది. అన్నా హజారే గారు మా కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా లో నటించారు. పూర్తి వినొదత్మకంగా ఉంటూ సందేశాన్ని అందించే చిత్రమిదన్నారు.

 

ఈ చిత్రానికి సంగీతం : రవి శంకర్ ( సర్కార్ 3 ఫేం), బోలె, డివోపి: జయ్ నందన్ కుమార్, ఎడిటింగ్: వి.కామెపల్లి,  నిర్మాతలు: మీనా, రవి,  దర్శకత్వం : రవి సదాశివ్

Follow Us:
Download App:
  • android
  • ios