Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అంకిత,తులసి దగ్గరికి వెళ్లి ఇంత రాత్రి టైంలో ఏం రాస్తున్నారు ఆంటీ ఆఫీస్ వర్క్ అనగా లేదమ్మా కేఫ్ వర్క్ అంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక అడుగు ముందుకు కూడా వేసాం కదా ఆంటీ అనడంతో కేఫె పెట్టమని ఆలోచన ఇచ్చింది నేనే మరి దాన్ని సక్సెస్ అయ్యేలా నేను కూడా చూడాలి కదా అనగా ఎందుకు ఆంటీ మీ ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది అని అంటుంది అంకిత. మీ మాటల్లో భయం కనిపిస్తోంది అనడంతో జీవితంలో ఓడిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఒంటరితనం నాకు ఎలా బతకాలో నేర్పించింది కానీ కేఫె విషయంలో మాత్రం అలా ఉండను అంకిత అని అంటుంది. పబ్లిసిటీ విషయంలో ఒక ఆలోచన చేశాను అదేంటో ఇప్పుడు చెప్పను కానీ మార్నింగ్ లేచిన తర్వాత నీకే తెలుస్తుంది అని అంటుంది తులసి.
మరుసటి రోజు ఉదయం తులసి పేపర్ లో రాసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు అందరూ తులసివైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు అంకిత రాత్రంతా మీరు మేలుకొని ఉన్నారా ఆంటీ అనడంతో నిద్ర పట్టడం లేదు అనగా ఏం రాస్తున్నావమ్మా అని అడుగుతాడు ప్రేమ్. పరంధామయ్య కూడా ఇదంతా ఏమి,అసలు అర్థమయ్యేలా చెప్పు తులసి అని అంటాడు. అప్పుడు తులసి మన మధ్య ఉన్న కొందరు చెప్పేకి ఎవరు వస్తారు అసలు ఈ కేఫ్ ఇక్కడ ఉందని ఎలా తెలుస్తుంది అని మాట్లాడారు కదా అని అంటుంది. అప్పుడు అనసూయ ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు అని అంటుంది. రాత్రంతా కూర్చుని మన పబ్లిసిటీ గురించి ఆలోచించాను అనడంతో దీనికోసం రాత్రంతా కూర్చోవాలా అని వెటకారంగా మాట్లాడుతుంది లాస్య.
నందగోపాల్ గారు మనం పబ్లిసిటీ స్టార్ట్ చేద్దాం అనగా ఏం చేస్తారు సీరియల్స్ మధ్యలో యాడ్స్ చేస్తారా అని అడుగుతుంది. లాస్య నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో నందు సీరియస్ అవ్వగా లేకపోతే ఏంటి నందు ఆవిడ గారు చెప్పడం మీరు వినడం అని అంటుంది. అప్పుడు ఇంట్లో తలా ఒక మాట అనడంతో తల్లి నువ్వు చెప్పమ్మా వింటాము అని అంటుంది లాస్య. పాంప్లెట్లు పంచుదాము అనడంతో ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు ఇవ్వకు అని అంటుంది లాస్య. నీ ఆలోచన నాకు నచ్చింది తులసి అని నందు అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు ఇంట్లో అందరూ మాకు కూడా నచ్చింది అనడంతో ఎందుకు నచ్చదు తులసి చెప్పింది కదా అని అంటుంది లాస్య. పాంప్లెంట్స్ పంచడానికి కుర్రాళ్ళు అవసరం కదా అనగా అవసరం లేదు మనమే పంచాలి అని అంటుంది తులసి.
ఇప్పటికే కేఫ్ పెట్టించి కుటుంబం పరువుని బజారుకి ఈడ్చావు ఇప్పుడు మళ్లీ ఏంటి మామ్ ఇది అసలు ఎందుకు నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అవి సీరియస్ అవుతాడు. అప్పుడు పరంధామయ్య ప్రస్తుతం కోట్లలో బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఎంతో కష్టపడిన వాళ్ళే అని అంటాడు. అప్పుడు ప్రేమ్ పాంప్లెట్ పంచడానికి మేము రెడీ అనడంతో పేపర్ కూడా రెడీగా ఉంది వెళ్లి పాంప్లెట్ లు ప్రింట్ చేయించుకుని రా అని చెబుతుంది తులసి. ఆ తర్వాత అభి హాస్పిటల్ కి బయలుదేరు అనడంతో నేను రావడం లేదు అని చెప్పి వెళ్ళిపోతుండగా నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ నిలబడు అంటాడు అభి. అంటే నువ్వు కూడా ఆ గొర్రెల మందతో కలిసి రోడ్డు మీద పాంప్లెట్లు పంచడానికి వెళ్తున్నావా అనడంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ అభి అని సీరియస్ అవుతుంది అంకిత. అసలు ఇంట్లో వాళ్లకి గౌరవం ఇవ్వని వాడితో మాట్లాడటం వేస్ట్ అని అంటుంది అంకిత.
నేను నీ భర్తని ఆ విషయం గుర్తుందా అనడంతో మనం భార్యాభర్తలమే కానీ అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలం కాదు అంటుంది అంకిత. నాకు భార్య అవ్వడం వల్లే నువ్వు ఇంటికి కోడలివి అయ్యావు అనడంతో నీ వల్ల నాకు అదొక్కటే మంచి జరిగింది అని అంటుంది అంకిత. కేఫ్ విషయంలో నువ్వు కలుగజేసుకోకు ఆ బురద నువ్వు అంటించుకోకు, వాళ్ళని వదిలేయ్ అనడంతో సేమ్ డైలాగ్ నీకు అదే చెబుతున్నాను అని అంటుంది అంకిత. నాకంటే నా కుటుంబం ఎక్కువయిందా అనగా ఇది మన కుటుంబం అని అభికి బుద్ధి చెబుతుంది అంకిత. ఆ తర్వాత రాములమ్మ అయ్యగారు అందరికీ పని చేసి పెడుతుంటే చూడడానికి బాధగా ఉంది అనడంతో ఇంతలోనే అక్కడికి ప్రేమ్ పాంప్లెంట్లు తీసుకొని వస్తాడు. నందు అక్కడికి వచ్చి ఆ పాంప్లెట్లు చూసి పర్సనల్ గా ఇవన్నీ ఇక్కడ పంచుతాను అని సంతోషంగా ఉంటాడు.
అప్పుడు అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడతారు. అప్పుడు కుటుంబం అందరూ సంతోషంగా నందుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో అది చూసి నందు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు ప్రేమ్ ఏమి అయ్యింది నాన్న అనగా అప్పుడు ఒంటరి వాడిని అని ఫీల్ అయ్య వాడిని కానీ ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తుంటే ఆనందంగా ఉంది అనడంతో ప్రేమ్ నందు ఇద్దరు హత్తుకుని సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి పాంప్లెట్లు పంచడానికి వెళ్తారు. రాములమ్మ పాంప్లెట్లు పంచుతూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ పాంప్లెట్లు పంచి కేఫ్ లో ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో కస్టమర్స్ అందరూ చాలామంది రావడంతో అందరూ హడావిడిగా వారికి సర్వ్ చేస్తూ ఉంటారు.
లాస్ట్ ఇయర్ స్టైల్ గా నిలబడి ఉండగా ఇంతలోనే ఒకతను పిలిచి ఇక్కడ నీళ్లు లేవు నీళ్లు తీసుకురామ్మ అని చెప్పడంతో లాస్య నీళ్ళు సర్వ్ చేస్తుంది. ఆ తర్వాత కస్టమర్స్ అందరూ వెళ్లిపోవడంతో అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు తులసి ఇద్దరు కేఫ్ డెవలప్ చేసుకోవడానికి మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోష పడుతూ ఉంటారు.
