Asianet News TeluguAsianet News Telugu

అంజలి లవ్ ఎఫైర్ దోసె..మసాలా దోసె..మనసు దోసె

  • అంజలి కోసం దోసె వేసిన జై
  • జైతో అంజలి ప్రేమాయణాన్ని కన్ఫమ్ చేసిన దోసె
  • అంజలి కోసం సూర్య విసిరిన దోసె ఛాలెంజ్ చేసిన జై
anjali jay love story confirmed

జర్నీ సినిమాతో హిట్ అందుకున్న జోడీ జే అంజలి. తమిళ హీరో జయ్, అంజలి కలిసి నటించిన జయ్ చిత్రం తమిళంలో ‘ఎంగేయుమ్‌ ఎప్పొత్తుమ్‌’ పేరుతో రిలీజ్ అంయింది. దీనర్థం ఎక్కడికైనా ఎప్పుడైనా అని. ‘నీతో పాటు ఎక్కడికైనా వస్తా.. ఎప్పుడైనా వస్తా.. ప్రామిస్‌’ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరో జే, హీరోయిన్‌ అంజలి అనుకున్నారేమో. నిజంగానే ఒకరి కోసం ఒకరు ఎంతదాకా అయినా వెళ్లేంత బలమైన బంధంలో ఉన్నారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చింది. ‘అదేం లేదు’ అని అడిగినవాళ్లకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘అవును’ అని జై చెప్పేశాడు. జై, అంజలి జంటగా నటించిన తాజా తమిళ చిత్రం ‘బెలూన్‌’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో చెన్నై మీడియా అంజలి గురించి ప్రస్తావించగా.. ‘‘నేనూ, అంజలి సన్నిహితంగా ఉంటున్న విషయం నిజమే అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు జయ్.

మా మధ్య మంచి స్నేహం, అవగాహన ఉన్నాయి. నాకు అంజలి అంటే ఇష్టం. తనకు నేనంటే ఇష్టం. ‘ఎంగేయుమ్‌ ఎప్పోత్తుమ్‌’ సినిమాలో అంజలి నన్ను ఎప్పుడూ కొడుతుంటుంది. రఫ్‌ గాళ్‌లా కనిపిస్తుంది. కానీ, రియల్‌ లైఫ్‌లో తను అలా కాదు. చాలా సాఫ్ట్‌. ఆ స్వభావం నాకిష్టం. అంజలి ఎప్పుడైనా కోపంగా ఉన్నా, బాధలో ఉన్నా నేను కామెడీ చేసి, నవ్వించేస్తాను. అది తనకిష్టం’’ అన్నారు. ఈ మధ్య జై తన ఇంట్లో దోసెలు వేయడం, అంజలి కూడా అతని పక్కన ఉండటం, ఆ సమయంలో దిగిన ఫొటోలు ఇద్దరూ సోషల్‌ మీడియాలో పెట్టడం తెలిసిందే. ‘‘అంజలి మా ఇంటికి అప్పుడప్పుడూ వస్తుంటుంది. తనకు వంట బాగా వచ్చు.

 

అంజలి వంట, ఆమె గుణం మా నాన్నగారికి ఇష్టం. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్లతో అంజలి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది’’అని జై అన్నారు. ప్రేమికుల దినోత్సవం నాడు అంజలి హైదరాబాద్‌లో, తాను చెన్నైలో ఉన్నామని తెలిపారు. ఇంతకీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న జై ముందుంచితే – ‘‘దాని గురించి ఇంకా ఆలోచించలేదు. అయినా నాకన్నా సీనియర్లు ఆర్య, విశాల్, శింబు ఉన్నారు. ఆ ముగ్గురి పెళ్లీ అయిన తర్వాత మా పెళ్లి ఫిక్స్‌ చేస్తాం’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఈ మధ్య కాలంలో అంజలి తన లవ్ ఎఫైర్‌ గురించి బయటపెట్టలేదు. మామూలుగా లేడీస్‌ ఫస్ట్‌ అంటుంటారు. కానీ, ప్రేమను వ్యక్తం చేయడంలోనూ, అది నలుగురికీ చెప్పడంలోనూ దాదాపు అబ్బాయిలే ముందుంటారు. అంజలి కూడా జై నోటి నుంచే తమ లవ్‌స్టోరీ బయటకు రావాలని అనుకుని ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios