Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంతో ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా మంచి రేటింగ్ తో కూడా దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఫిబ్రవరి 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో నేను ఈ ప్రాజెక్టు చాలా ప్రెస్టేజ్ గా చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను టైప్ అయిన కంపెనీ మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ అదే ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ అంటూ ఆనందంగా చెప్తుంది అంజలి. నేను కోరుకున్నట్లుగానే మీ అందరి సహకారంతో ఈ ప్రాజెక్టు కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అంటూ ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ ఎండి నీరజ్ వర్ధన్ అతని భార్య మాన్సి వర్ధన్ ని పరిచయం చేస్తుంది అంజలి.
నీరజ్ ఎక్కడ అని అడుగుతుంది అంజలి. తను ఇంకా కాల్ లోనే ఉన్నట్లు ఉన్నాడు మీరు కానివ్వండి అంటుంది మాన్సీ. నీరజ్ వర్ధన్ మనకి చాలా హెల్ప్ చేశారు. అతన్ని చూశాకే ఆర్య వర్ధన్ కంపెనీ ఎందుకు అంత హై లెవెల్ లో ఉందో మనకి అర్థమవుతుంది.. వెరీ హంబెల్ పర్సన్ అంటుంది అంజలి. వాళ్లతో కలిసి ఈ వర్క్ చేయడం రియల్లీ ప్రౌడ్ ఫర్ మీ అంటుంది. అందర్నీ భోజనానికి వెళ్ళమను పార్టీ త్వరగా క్లోజ్ చేద్దాం అంటుంది మాన్సీ.
అప్పుడేనా అంటూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకి తీసుకెళ్లడానికి ఒక ప్రాజెక్ట్ హెడ్ ని అపాయింట్ చేయమన్నాను. అంటే అతనికి ప్లానింగ్ ప్రాసెసింగ్ అన్ని టైం టు టైం ఫర్ఫెక్ట్గా చేయగలిగే సమర్ధత ఉండాలి, ముఖ్యంగా వర్కర్స్ అందర్నీ టీం గా లీడ్ చేయగల పవర్ఫుల్ లీడర్ అయి ఉండాలి అంటుంది. అలాంటివాడు నాకు ఎదురయ్యాడు. మిషన్ సౌండ్ ని బట్టి దాని కండిషన్ ని చెప్పేస్తాడు, ఏం పని నైనా కండబలంతో పాటు బుద్ధి బలంతో కూడా చేసి చూపిస్తాడు.
ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లాన్ ని 10 నిమిషాల్లో డీల్ చేసేసాడు ఆర్య వర్ధన్ ని తలుచుకొని చెప్తుంది అంజలి. అది తనని ఉద్దేశించిందే అని అక్కడే ఉన్న ఆర్య వర్ధన్ కి అర్థమవుతుంది. ఎంత తపిస్తే అంత అవుట్ పుట్ వస్తుందో మీరే చూడండి అంటూ ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ చూపిస్తుంది అంజలి. అది చూసి అందరూ క్లాప్స్ కొడతారు. ప్లీజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ ఆనంద్ అంటుంది అంజలి. ఆ మాటకి షాక్ అవుతుంది మాన్సీ.
ఆనంద్ ని స్టేజి మీదకి రమ్మంటుంది అంజలి. మీ కష్టం వృధా కాలేదు మీరు ఎక్కడ ఉన్నా మీ గుర్తింపు మీకు ఉంటుందని నిరూపించారు అనుకుంటుంది అను. ఆనంద్ ని మాన్సికి పరిచయం చేస్తుంది అంజలి. మాన్సి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు డోర్ లాక్ అయిపోవటంతో లోపల నుంచి ఎవరైనా ఉన్నారా అని పిలుస్తాడు నీరజ్. అప్పుడే గ్లాస్ విండో లో నుంచి ఆర్య వర్ధన్ని చూస్తాడు. దాదా అంటూ కంగారుగా ఎవరైనా ఓపెన్ చేయండి అంటూ తాపత్రయపడతాడు. ఇకనుంచి వెళ్ళిపోవాలి అనుకొని నాకు పని ఉంది నేను వెళ్ళవచ్చా అంటాడు.
నీరజ్ గారికి కూడా పరిచయం చేస్తాను వెయిట్ చేయండి అంటుంది అంజలి. నీరజ్ రావడానికి టైం పడుతుంది అతనికి పని ఉందంటున్నారు కదా పంపించేయండి అంటుంది మాన్సీ. అంతలోనే ఎవరు డోర్ ఓపెన్ చేయటంతో అక్కడికి వస్తాడు నీరజ్. అతనికి ఆనంద్ ని పరిచయం చేస్తుంది అంజలి. ఎమోషన్ ఆపుకోలేని ఆర్య ని హత్తుకొని దాదా ఐ మిస్ యు అంటాడు. నువ్వు ఇక్కడ ఏమి.. ఇట్స్ మై రిక్వెస్ట్ అంటాడు ఆర్య.
ఇతన్ని ఎందుకు ప్రాజెక్ట్ హెడ్ గా పెట్టాను తెలుసా అని అంజలి అంటే నాకు తెలుసు అంటాడు నీరజ్. ఎలా అంటే కొందరి గురించి పరిచయాలు అక్కర్లేదు, హి ఈజ్ సంథింగ్ స్పెషల్ అండ్ హి కెన్ డు ఎనీథింగ్ అంటాడు నీరజ్. మీరు నాకు ఎంత ఫేవరెట్ చేశారో మీకే తెలియదు మీకు థాంక్స్ అంటాడు నీరజ్. మీకు కన్స్ట్రక్షన్ ప్లాన్ కూడా ఓకేనా అంటుంది అంజలి. అయినా ఏం చేసినా బెస్ట్ గానే ఉంటుంది నాకు ఓకే అంటాడు నీరజ్. నౌ ఎంజాయ్ ది పార్టీ అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నా మీద ఇంకా కోపం పోలేదా నన్ను క్షమించి ఇంటికి వచ్చేయండి అంటాడు నీరజ్.
నేను కోపంతో ఇంటి నుంచి రాలేదు మార్పు కోసం వచ్చాను. నేను కోరుకున్న మార్పు వచ్చింది అని నమ్మినప్పుడు నేను ఇంటికి తిరిగి వస్తాను ఈ దాదా మాటని గౌరవిస్తావని అనుకుంటున్నాను అంటాడు ఆర్య. నీ ఇష్టం దాదా నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను కానీ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ భార్య అని హత్తుకుంటాడు నీరజ్. అప్పుడే ఏదో గుర్తొచ్చిన వాడిలాగా దాదా వదినమ్మ అంటూ ప్రశ్నార్ధకంగా చూస్తాడు. గార్డెన్ లో ఉన్న తన భార్యని చూపిస్తాడు ఆర్య. వెళ్లి ఆమె పాదాలు పట్టుకుంటాడు నీరజ్.
మళ్లీ తమాయించుకుని పైకి లెగుస్తాడు. మీరు కూడా ఫుడ్ తీసుకోండి అని అంజలి అంటే కడుపు నిండిపోయింది అంటాడు నీరజ్. ఇదంతా చూస్తున్న మాన్సి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అదేంటి అప్పుడే అంటుంది అంజలి. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక మళ్లీ ప్లాన్ చేద్దాం. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ ఆనందంగా చెప్తాడు నీరజ్. మాన్సీ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆర్య కి ఆల్ ది బెస్ట్ చెప్పి లాప్టాప్ ఇస్తుంది అంజలి.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ప్రాజెక్టు డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి కదా అందుకే అంటుంది అంజలి. మీరందరూ ఆనంద్ గారికి సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్టుని సక్సెస్ చేయాలి అంటూ స్టాఫ్ అందరికీ చెప్తుంది అంజలి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను అంటే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు ఆర్య. ఇదంతా చూస్తూ కోపంతో మండిపోతూ ఉంటాడు యాదగిరి. అంజలి వచ్చి భోజనం చేసావా అని అడిగితే నాకొద్దు నేను హర్ట్ అయ్యాను అంటాడు యాదగిరి.
నిన్న కాక మొన్న వచ్చిన ఆనంద్ కి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తున్నారు. నాకు మాత్రం ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ లు అంటాడు యాదగిరి. మీకు అతని మీద ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే అతను దగ్గర వర్క్ నేర్చుకుంటున్నాను ప్లీజ్ మై గురు అంటుంది అంజలి. మరి నేను అంటే నువ్వు బండ్ల గణేష్ లెక్క అంటుంది అంజలి. మరోవైపు తన భార్యతో రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తాడు ఆర్య. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.