సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై అనిరుధ్ క్లారిటీ ఇచ్చారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలను ఖండించారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి జరగనుంది అనే ప్రచారం ఇటీవల ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిరుధ్ స్వయంగా స్పష్టం చేశారు. 

కావ్య మారన్ తో అనిరుధ్ లవ్ ఎఫైర్ ?

ఈ గాసిప్స్‌కు మూలం రెడిట్‌లో వచ్చిన ఓ పోస్ట్. ఇందులో అనిరుధ్, కావ్య మారన్ గత ఏడాదిగా ప్రేమలో ఉన్నారని, కుటుంబాల మధ్య ఇప్పటికే వివాహ చర్చలు జరిగినట్లు, రజనీకాంత్ కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని పేర్కొన్నారు. అలాగే అనిరుధ్, కావ్య కలిసి లాస్ వెగాస్ సహా పలు ప్రాంతాల్లో వెకేషన్ లో కనిపించారన్న వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. రూమర్స్ ఎక్కువవుతున్న తరుణంలో అనిరుధ్ స్పందించారు. 

అనిరుధ్ రియాక్షన్ 

 తన X  ఖాతాలో.. ఏంటి పెళ్లా ? చిల్ అవుట్ గయ్స్, ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

 

Scroll to load tweet…

 

అనిరుధ్ ఇప్పటికే పలుమార్లు తాను ఒంటరిగా ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక కావ్య మారన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సన్ గ్రూప్ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కావ్య మారన్ ఐపీఎల్ ప్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ద్వారా తెలుగువారికి బాగా చేరువయ్యారు.