MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా

చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా

చంద్రమోహన్ 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తాను ఒక లెజెండ్రీ హీరోయిన్ ని అవమానించిన సంఘటనని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 14 2025, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ హిట్ మూవీతో ఎంట్రీ
Image Credit : Youtube

సూపర్ హిట్ మూవీతో ఎంట్రీ

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల చిత్రాల్లో ఆయన నటించారు. 1996లో చంద్రమోహన్.. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రంగులరాట్నం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. తొలి చిత్రంతోనే నటనలో చంద్రమోహన్ అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్లకు చంద్రమోహన్ సెంటిమెంట్
Image Credit : our own

హీరోయిన్లకు చంద్రమోహన్ సెంటిమెంట్

అప్పట్లో చంద్రమోహన్ విషయంలో ఇండస్ట్రీలో ఒక ప్రచారం జోరుగా సాగేది. అదేంటంటే కొత్త హీరోయిన్లు ఎవరైనా చంద్రమోహన్ తో నటిస్తే ఆ తర్వాత వాళ్ళు టాప్ హీరోయిన్ గా ఎదిగేవాళ్లు. వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, విజయశాంతి, రాధా ఇలా చాలామంది హీరోయిన్ల విషయంలో చంద్రమోహన్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సెంటిమెంట్ నిజమే.. కానీ చాలామంది హీరోయిన్ల విషయంలో అది ఎలా అంత అద్భుతంగా జరిగిందో నాకు కూడా తెలియదు. హీరోయిన్లే నా దగ్గరకు వచ్చి.. మీతో నటించడం వల్లే స్టార్లు అయ్యామని చెప్పేవాళ్ళు.

35
చంద్రమోహన్ తో హీరోయిన్ గా వాణిశ్రీ
Image Credit : Social Media

చంద్రమోహన్ తో హీరోయిన్ గా వాణిశ్రీ

లెజెండ్రీ నటి వాణిశ్రీ విషయంలో జరిగిన ఒక సంఘటనని చంద్రమోహన్ బయటపెట్టారు. రంగులరాట్నం చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకునేందుకు ముందుగా చంద్రమోహన్ అంగీకరించలేదట. ఎందుకంటే అప్పటివరకు వాణిశ్రీ కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పక్కన చెలికత్తె వేషాలు, చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసేవారట.

45
ఆమెని చిన్నచూపు చూసిన చంద్రమోహన్
Image Credit : our own

ఆమెని చిన్నచూపు చూసిన చంద్రమోహన్

దీంతో చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయిన్ ఏంటి.. ఆమెని మార్చేయండి అని చంద్రమోహన్ డైరెక్టర్ బి.ఎన్ రెడ్డిని అడిగారట. ఆమె పక్కన నటిస్తే తొలి చిత్రంతోనే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని అన్నారట. అప్పుడు బి.ఎన్.రెడ్డి ఇచ్చిన సమాధానం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని.. ఆయన చెప్పిన మాటలే ఆ తర్వాత నిజమయ్యాయని చంద్రమోహన్ అన్నారు. వాణిశ్రీని తక్కువగా అంచనా వేస్తున్నావ్.. ఏదో ఒక రోజు ఇండస్ట్రీని రూల్ చేస్తుంది చూడు అని బి.ఎన్ రెడ్డి చెప్పారట.

55
ఇండస్ట్రీని ఏలిన వాణిశ్రీ
Image Credit : our own

ఇండస్ట్రీని ఏలిన వాణిశ్రీ

ఆ తర్వాత వాణిశ్రీ పదేళ్లపాటు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణించింది.. బియన్ రెడ్డి మాటలే నిజమయ్యాయి అని చంద్రమోహన్ అన్నారు. తన కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే రంగులరాట్నం చిత్రమే అని చంద్రమోహన్ అన్నారు. ఆ తర్వాత కూడా చాలా అద్భుతమైన చిత్రాలు చేశాను. కానీ రంగులరాట్నం చిత్రంలో నటించినప్పుడు చాలామంది నన్ను ప్రశంసించారు. కొత్త కుర్రాడిలా నటించలేదు.. అనుభవం ఉన్న నటుడిగా నటించావని ప్రశంసించినట్లు చంద్రమోహన్ తెలిపారు.

తన కెరీర్ లో రంగులరాట్నం తర్వాత సిరి సిరి మువ్వ, రాధా కళ్యాణం, పదహారేళ్ళ వయసు, సీతామాలక్ష్మి, శుభోదయం చిత్రాలు బెస్ట్ మూవీస్ అని చంద్రమోహన్ అన్నారు. పదహారేళ్ళ వయసు చిత్రానికి ఉత్తమ నటుడిగా చంద్రమోహన్ కి ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. 

చంద్రమోహన్ 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. చంద్రమోహన్ చివరగా దువ్వాడ జగన్నాథమ్, గౌతమ్ నందా, ఆక్సిజన్ లాంటి చిత్రాల్లో నటించారు. 2023లో అనారోగ్య కారణాలతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image2
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Recommended image3
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Related Stories
Recommended image1
ఇద్దరి కాంబినేషన్ లో 3 చిత్రాలు.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా ?
Recommended image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved