శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై  నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా 'ఏంజెల్ 'ఏంజెల్' ఆడియో విడుదల రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన ఏంజెల్

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించే ఈ సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ప్రస్తుతం హాలీవుడ్ గ్రాఫిక్ నిపుణుల పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా సంబంధించిన ఆడియోని ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు. దాంతో పాటే ఆల్బమ్ లో ఉన్న నాలుగు పాటల్ని ఒక్కొక్కటిగా వివిధ టీవి మీడియా సంస్థల్లో లైవ్ షో ద్వారా లాంఛ్ చేసేందుకు ఏంజెల్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆడియో ప్రమోషన్ క్యాంపైన్ మే 24 నుంచి మొదలవుతుందని ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్ ప్రకటించారు. ఈ సినిమాకు బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెసరోలియో సంగీత దర్శకత్వం వహించారు. భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ కచ్ఛితంగా శ్రోతల్ని ఆకట్టుకుంటాయని ఏంజెల్ చిత్ర బృందం చెబుతోంది. 

బ్యానర్- శ్రీ సరస్వతి ఫిల్మ్స్, తారాగణం-హీరో- నాగ అన్వేష్, హీరోయిన్- హేబా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన

సాంకేతిక వర్గం- ప్రొడ్యూసర్- భువన్ సాగర్, డైరెక్టర్- 'బాహుబలి' పళని, సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో , సినిమాటోగ్రఫి - గుణ