మెగాస్టార్ చిరంజీవికి పొలిటికల్ సెగ తగిలింది. రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం చిరంజీవి వైజాగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక హోదా సెగ తగిలింది. ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరు రాకతో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ప్లకార్డులతో నిరనస తెలియజేసారు. చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే.

 

చిరంజీవికి తన తనయుడు రాంచరణ్ సినిమా ఈవెంట్స్ మినహా ఏపీ సమస్యలు పట్టవా అంటూ ఏయూ యువత ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏయూ విద్యార్థులని పోలీస్ లు నిలువరించారు. పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చిన తరువాత చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సైరా చిత్రంలో నటిస్తున్నారు.