సుమ అందుకే కనిపించడం లేదా..?

First Published 11, Jun 2018, 12:12 PM IST
Anchor Suma Shocking Remuneration
Highlights

స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. దాదాపు టీవీ షోలన్నీ కవర్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. 

స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. దాదాపు టీవీ షోలన్నీ కవర్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇక ఎవరైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే దానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. మూడు గంటల ఆడియో ఫంక్షన్ ను తనదైన స్టైల్ లో ఎంతో రసవత్తరంగా నడిపిస్తుంటుంది. అటువంటి ఈ మధ్యకాలంలో ఆమె పెద్దగా కనిపించడం లేదు.

ఎన్ని ఆడియో ఫంక్షన్స్ జరుగుతున్నా సుమ మాత్రం ఒక్క ఈవెంట్ లో కూడా కనిపించలేదు. ఆఖరిని రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆమె కనిపించకపోవడంతో కారణం ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీనికి రెమ్యునరేషన్ అసలైన కారణమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా ఫంక్షన్ అంటే ఏదైనా సరే కనీసం రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట.

ఇక పెద్ద హీరోల ఫంక్షన్లు అంటే మూడు లక్షలకు పైమాటే చెబుతోందని వినికిడి. అరగంట ఉండే టీజర్ లాంచ్ కు కూడా ఆమె రెండు లక్షలు రెమ్యునరేషన్ గా అడగడంతో నిర్మాతలు ఆమె స్థానంలో మరో యాంకర్ ను తీసుకుంటున్నారని సమాచారం. సుమతో పోలిస్తే యాంకర్ ఝాన్సీ తక్కువ రెమ్యునరేషన్ కు అంగీకరించడంతో ఆమెకు అవకాశాలు పెరిగాయి. కానీ సుమ మాత్రం తన పారితోషికం విషయంలో తగ్గేదే లేదన్నట్లు తెగేసి చెప్పేస్తుందట. 

loader