బిగ్ బాస్2: ఎలిమినేషన్ పై విమర్శలు

anchor shyamala eliminated from bigg boss2
Highlights

అతి తక్కువ ఓట్లు వచ్చిన ముగ్గురిలో శ్యామలను ఎలిమినేట్ చేసిన విధానం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అసలు ఎలిమినేట్ కావాల్సింది శ్యామల కాదని వేరొకరి స్థానంలో ఆమెను ఎలిమినేట్ చేశారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి

హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్2 కి మంచి రేటింగ్స్ వస్తున్నాయనే విషయాన్ని యాజమాన్యం వెల్లడించిన సంగతి తెలిసిందే. వీకెండ్ లో ఈ షోకి తన చరిష్మాతో మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నాని.ఈ సీజన్ తొలివారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యారు.

ఇక నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ షో మొదలుకాకముందే యాంకర్ శ్యామల ఎలిమినేట్ కాబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశా.. నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు. కానీ ఇంతలోనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసేశారు. అయితే షో నుండి శ్యామలను ఎలిమినేట్ చేయడం పట్ల పలువురు తప్పు బడుతున్నారు.

ఆమెను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన ముగ్గురిలో శ్యామలను ఎలిమినేట్ చేసిన విధానం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అసలు ఎలిమినేట్ కావాల్సింది శ్యామల కాదని వేరొకరి స్థానంలో ఆమెను ఎలిమినేట్ చేశారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. శ్యామలను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని కోరుతున్నారు. అయితే వెళ్తూ వెళ్తూ శ్యామల.. వారం మొత్తం అందరి బట్టలు ఉతికే బిగ్ బాంబ్ ను దీప్తిపై వేసింది. 

loader