క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. నన్ను కూడా ఆ పనికి పిలిచేవారు

Anchor Rashmi sensational comments on casting couch
Highlights

క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. నన్ను కూడా ఆ పనికి పిలిచేవారు

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు సినీ జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన యాంక‌ర్‌ల‌లో ర‌ష్మీ ఒక‌రు. ఎంత‌లా అంటే.. అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు మాంచి కిక్ ఇచ్చి, త‌న‌దైన న‌ట‌న‌తో బాగా క్రేజ్ సంపాదించుకునేంత‌లా. అందులోను తాను యాంక‌రింగ్ చేసిన షోలు, న‌టించిన చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతూ యాంక‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అంటూ ప్ర‌శంస‌లందుకుంటోంది.

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఇటీవ‌ల కాలంలో ప‌డ‌గ విప్పిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ప‌లువురు స్టార్ హీరోయిన్లు మీడియా ముఖంగా స్పందించి మ‌రీ ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల‌తోపాటు.. బ‌ఢా ప్రొడ్యూస‌ర్ల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై స్పందించిన ర‌ష్మీ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారాన్ని కేవ‌లం ఒక్క సినీ ఇండ‌స్ట్రీకి క‌ట్ట‌బెట్ట‌డం మించిది కాద‌ని, అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లు తీవ్ర లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది. గ‌తంలో త‌న‌ను కూడా కొంద‌రు ఇలా అడిగార‌ని, అందుకు తాను ఒప్పుకోక‌పోవ‌డంతో ప‌లు ఛాన్సులు కూడా మిస్సైన‌ట్టు చెప్పుకొచ్చింది ర‌ష్మీ.

loader