పెళ్లెప్పుడు చేసుకుంటారు.. రష్మికి నెటిజన్ ప్రశ్న

anchor rashmi responds on her marriage
Highlights

మీరు ఎప్పుడూ అనసూయ ఫ్యామిలీతో కలిసి పార్టీలలో కనిపిస్తుంటారు. మీకు కూడా త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా..?' ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆమె 'వివాహం నా వ్యక్తిగత విషయం' అని సదరు నెటిజన్ కు రిప్లై ఇచ్చింది

బుల్లితెర యాంకర్ గా బిజీగా గడుపుతోన్న సమయంలో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని నటిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేస్తోన్న బ్రేక్ మాత్రం రావడం లేదు.. కానీ అమ్మడుకి మాత్రం అవకాశాలు రావడం తగ్గలేదు.

ప్రస్తుతం ఆమె నటించిన 'అంతకు మించి' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మి ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతుంది. గతేడాది ఆమె వయసు 38 అని ఓ టీవీ ప్రోగ్రాంలో చెప్పింది. అంటే ఇప్పుడు నలభైకి దగ్గర పడుతుందన్నమాట. కానీ ఇప్పటికీ కూడా రష్మి పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇదే విషయంపై ఆమెకు సోషల్ మీడియాలో తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా ఓ నెటిజన్ 'మీరు ఎప్పుడూ అనసూయ ఫ్యామిలీతో కలిసి పార్టీలలో కనిపిస్తుంటారు. మీకు కూడా త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా..?' ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆమె 'వివాహం నా వ్యక్తిగత విషయం' అని సదరు నెటిజన్ కు రిప్లై ఇచ్చింది. అమ్మడు మాటలను బట్టి ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లుంది. 

loader