ప్రముఖ గాయకుడు ఎస్పీ సుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్ చేశాడు. హీరోయిన్లు ఎక్స్ పోజ్ చేసే విధంగా బట్టలు వేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.

దీంతో నాగబాబు.. ఎస్పీ బాలసుబ్రమణ్యంపై ఫైర్ అయ్యారు. ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతడిపై విమర్శలు గుప్పించాడు.  అమ్మాయిలను చూసే తీరు మారాలని అన్నారు. ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. చెప్పే అధికారం మీకు లేదని నాగబాబు అన్నారు.

ఈ క్రమంలో కొందరు నెటిజన్లు నాగబాబుని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. సంప్రదాయాలను పాటించమని చెప్పడంతో తప్పేముందంటూ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మి.. నాగబాబుని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.

''వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. ఆ గొప్పతనాన్ని వారు వేసుకునే దుస్తుల దృష్టి నుండి చూడకండి. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు నాగబాబు సర్'' అని రాసుకొచ్చింది.   
 

హీరోయిన్ల ఎక్స్ పోజింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నాగబాబు కౌంటర్!