మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పొలిటికల్ సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై విరుచుకు పడ్డాడు. ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా కౌంటర్లు వేశారు. ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్ల వస్త్రధారణ సరిగ్గా ఉండడం లేదని, కావాలని ఎక్స్ పోజ్ చేస్తున్నారని కొందరి మనోభావాలు హర్ట్ అయ్యేలా మాట్లాడారు.

ఇప్పుడు దీనిపై స్పందించిన నాగబాబు.. ''ఈ మధ్యన కొందరు మహానుభావులు, వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఆడవాళ్ల డ్రెస్సింగ్ మీద మాట్లాడాడు.. అలానే ఓ నటుడు పార్లమెంట్ లో మాట్లాడారు. ఆడవాళ్లు ఎక్స్ పోజ్ చేసే దుస్తులు వేసుకోకూడదని అన్నారు. అసలు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు..? మీకు ఎవరు అధికారం ఇచ్చారని'' ప్రశ్నించారు.

మగవాడి కామ దృష్టికి, నీచమైన ఆలోచనకి అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నా వాడి బుద్ధి మారదని అన్నారు. సినిమా హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారో అది వాళ్ల ఇష్టమని మధ్యలో చెప్పడానికి మీరెవరిని ఫైర్ అయ్యాడు. మగవాడి బట్టల విషయంలో ఆడపిల్లలు ఎప్పుడూ కండీషన్స్ పెట్టలేదని, పాత సంప్రదాయాలని పట్టుకొని గబ్బిలాలు మాదిరి వేలాడుతున్న వారు ఇకనైనా మారండని సూచించారు.

'అమ్మాయిలు ఎక్స్ పోజ్ చేస్తుంటే మీరు చూడకుండా ఉండలేరా..? ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండని' అన్నారు. 'మీరు చూసేదంతా చూసేసి చప్పలించేస్తారు.. ఆ తరువాత స్టేజ్ మీదకొచ్చి కబుర్లు చెప్తారు.. ఆపండి సార్' అంటూ బాలసుబ్రహ్మణ్యంని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.