నేను కూడా ప్రపోజ్ చేశా: రష్మి

anchor rashmi about her love proposals
Highlights

బుల్లితెరపై 'జబర్దస్త్' షోతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి నటిగా కూడా రాణిస్తోంది

బుల్లితెరపై 'జబర్దస్త్' షోతో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి నటిగా కూడా రాణిస్తోంది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా కనిపించింది. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన తాను సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారని.. కానీ ఎలాంటి కండీషన్స్ పెట్టలేదని వివరించింది.

ఇక పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని అన్నారు. దేనికైనా టైమ్ రావాలని తన తాతయ్య చెప్పేవారని.. ఆ సమయం వచ్చినప్పుడు అదే అవుతుందని అన్నారు. లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అనే ప్రశ్నకు సమాధానంగా.. అవన్నీ జీవితంలో ఒక భాగమని, చాలా మంది తనకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. ఐదేళ్ల క్రితం వస్తూ తాను కూడా ప్రపోజ్ చేసినట్లు తెలిపింది.

అయితే ఎవరికి ప్రపోజ్ చేసిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి వాటికి దూరంగా ఉంటూ కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.  

loader