తెలుగు బుల్లితెరపై మంచి గుర్తింపు పొందిన హాట్ యాంకర్ రష్మి పలు సినిమాల్లో నటించిన రష్మి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో గతం తలుచుకుని కంటతడి

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ లాంటి షోలతో తన సత్తా చాటిన యాంకర్ రష్మి... కొన్నేళ్ల క్రితం నుంచి సినిమా ఇండస్ట్రీలోనూ పడుతూ లేస్తూ.. ఇప్పుడు హిరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తన గ్లామర్ తో, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే రష్మి ఈ స్థాయికి రావటానికి చాలా కష్టపడింది. అందుకే సినిమా చిన్నదా పెద్దదా అనేదు చూడనని, నచ్చితే, సరైన పారితోషికం ఇస్తే... కచ్చితంగా చేస్తానని అంటోంది.

ఏ పనైనా చేస్తే ఏదో ఒక ఆత్మసంతృప్తి ఉండాలి. నటన పరంగా కానీ, లేదా బ్యాంకు బ్యాలెన్స్‌ పరంగా గానీ.. ఏదో ఒకటి ఉండాలి. నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డా. వైజాగ్‌ నుంచి ఒక్కదాన్నే హైదరాబాద్‌ వచ్చా. ఇక్కడకు వచ్చినప్పుడు నాకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. తొలిసారి అన్నపూర్ణా స్టూడియోస్‌ వారు రూ.25వేల చెక్‌ ఇచ్చారు. దాన్ని డిపాజిట్‌ చేసి అందులో ఏడు వేలు అద్దె కోసం తీసుకున్నా. 2 వేలతో కావాల్సిన సామాన్లు కొనుక్కున్నా. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు. ఒక యాభైవేలు కావాలి అని ఎప్పుడూ ఇంటికి కూడా ఫోన్‌ చేయలేదు. అడిగితే ఇచ్చేవాళ్లేమో. కానీ ఈ వృత్తి అలాంటిది. చాలా నేర్పిస్తుంది. ఇందులో సక్సెస్‌ అయితే బాగానే ఉంటుంది. ఫెయిల్‌ అయినా, ఇబ్బంది పడుతున్నా అందరూ మన చుట్టూ చేరతారు. మనల్ని, మన కుటుంబ సభ్యులను జడ్జి చేస్తారు. ఆ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు కాబట్టే డబ్బుకు అంత ప్రాధాన్యం ఇస్తా.

ఒకవేళ నేను చేసినదానికి 10వేలు ఎక్కువ తీసుకున్నా, అవి ఎవరికైనా సాయం చేయడానికి ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతోనే తీసుకుంటా. డబ్బు జీవితంలో చాలా ముఖ్యం. నాకు అవసరమైనప్పుడు చాలామంది సాయం చేశారు. నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో బ్యాంక్ ఖాతా తెరవాలన్నా డబ్బు కావాలి. ఇప్పుడున్నట్లు జనధన్ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఇక్కడే జాబ్‌ చేస్తాడు. ఆ ఫ్రెండ్ రూ.5,500 అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బుతో బ్యాంకు ఖాతా తెరిచా. అప్పుడు చెక్‌ డిపాజిట్‌ చేసి డబ్బులు డ్రా చేశా అని చెప్పుకొచ్చింది.

నిజంగా ప్రపంచం చాలా క్రూరమైంది. ఎవరూ మనకు కనీస గౌరవం ఇవ్వరు. ఒక అమ్మాయి ఒంటిరిగా ఉందని ఎవరూ పట్టించుకోరు. రాత్రి షూటింగ్‌ నుంచి లేటుగా వస్తే కనీసం గేటు కూడా తీయరు. ఆ సమయంలో చాలా జీవితం చూశా. ఒకవేళ అప్పుడే నా దగ్గర డబ్బుంటే నేను నాకు నచ్చిన అపార్ట్‌ మెంట్‌లో ఉండే దాన్ని. అందుకే నా జీవితంలో డబ్బుకు చాలా ప్రాధాన్యతనిస్తా అంటూ కన్నీటి పర్యంతమైంది.

 ‘‘మీరు మరీ గ్లామరస్‌గా నటిస్తున్నారు’ అని అందరూ అంటుంటారు. ఒక ఐదేళ్లుపోతే నేను గ్లామర్‌ పాత్రల్లో నటిస్తా చూడండి అంటే ఎవరూ చూడరు. ఈ టైమ్‌ ఫ్రేమ్‌లోనే మేము సెటిల్‌ అయిపోవాలి. వృద్ధాశ్రమంలో ఉండాలన్నా డబ్బులు కట్టి ఉండాలి. ప్రపంచమంతా కమర్షియల్‌ అయిపోయింది. అలా ఉండకపోతే జీవితంలో బతకలేం. మంచి గుర్తింపు వచ్చేదాకా ఇంటికి కూడా వెళ్లలేదు. “చుట్టూ ముళ్లున్న పువ్వులాంటిది మా జీవితం’’ అంటూ తన లైఫ్ గురించి చెప్పుకొచ్చింది రష్మి.