నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఆయనతో అఫైర్ అంటగట్టారు : అనసూయ

నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఆయనతో అఫైర్ అంటగట్టారు : అనసూయ

 బుల్లితెరపై తన అందచందాలతో యువకుల మనసులను కొల్లగొటుతున్న హాట్ యాంకర్ అనసూయ.  “రంగస్థలం”లో యాంకర్ అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంత పాపులర్ అయ్యిందో అందరి మనసులను ఎలా దోచుకుందో తెలిసిందే. అనసూయ ‘రంగస్థలం’ సినిమా విజయోత్సవాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

తన కెరీర్ ప్రారంభంలో హెచ్ఆర్ గా పని చేశానని… ఆ తర్వాత మీడియాలో ప్రవేశించినట్టు తెలిపింది. టెలివిజన్ షోలలో యాంకర్‌గా పని చేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టినట్టు వివరించింది. అయితే, మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని… ఆ సమయంలో ఆయనతో తనకు అపైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తాను గర్భవతినని… ఆ వార్తలతో తాను ఉలిక్కిపడిపోయానని చెప్పింది. అయితే, తన భర్త తనకు అండగా నిలబడ్డారని… నేను నమ్మనంత వరకు నీవు భయపడాల్సిన అవసరం లేదని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. తన కుటుంబసభ్యులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే నా కెరీర్ ఇంత సాఫీగా సాగుతోందని చెప్పుకొచ్చింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page