బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న అనసూయ మెల్లమెల్లగా సినిమాలలో కూడా బిజీ అవుతోంది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగంమత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఈ సినిమా తరువాత తన కెరీర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అనసూయ. తాజాగా వైఎస్సార్ బయోపిక్ లో అవకాశం వస్తే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కనున్న వైఎస్సార్ 'యాత్ర' బయోపిక్ లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకుంది. కర్నూలు జిల్లాలోని ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రలో ఆమె కనిపించబోతుందని సమాచారం.

ఈ విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దర్శకుడు మహివిరాఘవ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించనున్నారు. ఇక వైఎస్ఆర్ భార్య విజయమ్మ పాత్రలో వేముగంటి అశ్రితా కనిపించనున్నారు.