ఐటెం సాంగ్ కు రష్మీ, అనసూయల డాన్స్.. వీడియో వైరల్

anasuya, rashmi dance video goes viral
Highlights

బాలీవుడ్ హిట్ పాటల్లో ఒకటైన 'బాబూజీ  జరా ధీరే చలో' అనే ఐటెం పాటకు అనసూయ, రష్మీ కలిసి డాన్స్ చేశారు. పబ్ మాదిరి కనిపిస్తోన్న లొకేషన్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని క్యాజువల్ డ్రెస్సులో ఈ ఇద్దరు భామలు వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది

జబర్దస్త్ షో పాపులర్ అయిన ఇద్దరు యాంకర్లు అనసూయ, రష్మీలకు సరిగ్గా పడదని బయట పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ ఇద్దరు బ్యూటీలు మంచి స్నేహితులు. అనసూయ కుటుంబంతో అప్పుడప్పుడు రష్మీ కూడా కనిపిస్తుంటుంది.

ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఇద్దరు భామలు కలిసి డాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హిట్ పాటల్లో ఒకటైన 'బాబూజీ  జరా ధీరే చలో' అనే ఐటెం పాటకు అనసూయ, రష్మీ కలిసి డాన్స్ చేశారు. పబ్ మాదిరి కనిపిస్తోన్న లొకేషన్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని క్యాజువల్ డ్రెస్సులో ఈ ఇద్దరు భామలు వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ప్రతివారం జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ ఇద్దరు మరోసారి తమ డాన్స్ తో యూత్ ను ఫిదా చేసేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 


  

loader