- Home
- Entertainment
- Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Dhurandhar Day 50 Collection: రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. తాజాగా ఈమూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.

50 రోజులు పూర్తి చేసుకున్న `ధురంధర్`
స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' ఏడో వారంలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది చరిత్రలో అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే, సన్నీ డియోల్ 'బార్డర్ 2' మూవీ రణవీర్ సింగ్ సినిమాని దెబ్బ కొట్టింది. దీంతో `ధురంధర్` హవా క్లోజ్ అయ్యింది.
ధురంధర్ కలెక్షన్లు
రణ్ వీర్ సింగ్‌తోపాటు అక్షయ్ ఖన్నా నట విశ్వరూపానికి కేరాఫ్‌గా నిలిచిన `ధురంధర్` మూవీ వసూళ్లు నిన్నటి వరకు వచ్చాయి. కానీ శుక్రవారంతో క్లోజ్ అయ్యింది. అయితే ఈ మూవీ యాభై రోజులు పూర్తి చేసుకుంది. 'ధురంధర్' ఏడో వారంలో 48వ రోజు రూ.1.15 కోట్లు, 49వ రోజు రూ.1.1 కోట్లు వసూలు చేసింది. ఏడో వారం మొత్తం కలెక్షన్ రూ.13.9 కోట్లు.
ధురంధర్ 50 రోజుల కలెక్షన్లు
బసంత్ పంచమి (జనవరి 23, 2026) రోజున 'ధురంధర్' మార్నింగ్ షో ఆక్యుపెన్సీ 8.46%, మధ్యాహ్నం షో 21.36%గా ఉంది. సాయంత్రం, రాత్రి షోల వివరాలు లేవు. `ధురంధర్` 50వ రోజు బాక్సాఫీసు కలెక్షన్. ఏడో వారంలోనూ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. 50వ రోజుకు మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ.830.86 కోట్లు. 50వ రోజు రూ.0.36 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇది పూర్తిగా క్లోజ్‌కి చేరుకుంది.
బాలీవుడ్‌లో రెండో మూవీగా రికార్డు
విదేశాల్లో భారీ వసూళ్లని రాబట్టగా, మొత్తంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1,289 కోట్లు సాధించింది ఇది `దంగల్`, `బాహుబలి 2`, `పుష్ప 2` వంటి బ్లాక్‌బస్టర్‌లతో పోటీ పడుతోంది. బాలీవుడ్‌లో అయితే `దంగల్` తప్ప అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. అంతేకాదు ఇండియాలో ఎక్కువ వసూళ్లు చేసిన బాలీవుడ్ మూవీగా నిలిచింది.

