నేనేం హీరోయిన్ కు తక్కువ కాదు!

First Published 2, Jun 2018, 2:48 PM IST
anasuya launch new boutique in vizag
Highlights

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ నటిగా గా కూడా గుర్తింపు పొందింది

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ నటిగా గా కూడా గుర్తింపు పొందింది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగంమత్త పాత్ర నటిగా అనసూయకు ఎనలేని పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత అనసూయ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

తాజాగా ఈ బ్యూటీ ఓ బొటీక్ ఓపెనింగ్ కోసం వైజాగ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన అనసూయ ప్రస్తుతం 5 చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. రంగమ్మత్తల మంచి క్యారెక్టర్స్ తో గుర్తింపు తెచ్చుకోవాలనుందని.. హీరోయిన్ కు తానేమీ తక్కువ కాదని.. ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడకి వెళ్ళినా అందరూ రంగంమత్త అని పిలవడం సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. జబర్దస్త్ షోలో ఒక రకంగా, రంగస్థలంలో మరోలా అభిమానులు తనను ప్రత్యేకంగా చూడడం ఆనందంగా ఉందన్నారు.   

loader