సినిమా తారల వయసు పెరుగుతున్నా.. ఆంటీ అని పిలుపించుకోవడానికి ఇష్టపడరు. సాధారణ అమ్మాయిలు సైతం తమని ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు.. అలాంటిది స్టార్ యాంకర్ అనసూయని ఓ వ్యక్తి లైవ్ ఈవెంట్ లో ఆంటీ అని పిలిచాడు.

మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అయిందంటే.. ''నా పిల్లల స్నేహితులు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. సో.. పెద్దగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. అంతేకాదు ఆంటీగా ఉండడానికి నేనేమీ ఇబ్బంది పడను.

వయసు పెరగడాన్ని, దాంతో వచ్చే మార్పులని గౌరవంగా స్వీకరిస్తాను. అయితే నాకు యాభై ఏళ్లు వచ్చినా.. ఇలానే కనిపించాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అనసూయ జవాబుతో నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు.

జబర్దస్త్ గా బదులిచ్చావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె 'కథనం' అనే సినిమాతో పాటు మరో అరడజను సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. 

ఇది కూడా చదవండి.. 

షార్ట్స్ వేసి అనసూయ హాట్..హాట్ గా..