బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ‌ సినిమాల్లోకి వచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రంగస్దలం లో రంగమ్మత్తగా ఆమె రచ్చ చేసినప్పటి నుంచి అభిమానులు రెట్టింపు అయ్యారు. ఆ అభిమానాన్ని కంటిన్యూ చేయటానికి  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూంటుంది. ట్విట్టర్‌‌, ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాలు చెప్తూంటుంది. తన ఫొటోలు షేర్ చేస్తూంటుంది.

 తాజాగా ఆమె తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్లింది. ఓ సముద్రం ఒడ్డున ఆమె సేద తీరింది. ఈ నేపధ్యంలో ఆమె ఓ ఫొటో ని షేర్ చేసింది.  ఆ ఫోటో ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫొటోలో అనసూయ కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. షార్ట్ ,క్యాజువల్ షర్ట్ తో ఆమె అదరకొడుతోంది. ఈ ఫోటోకు కామెంట్ ని సైతం కవితాత్మకంగా పెట్టింది. ఈ బీచ్ లో ఇలా ఉంటూ..సముద్రాన్ని చూస్తూ జీవితం గడిపెయ్యాలనిపిస్తోంది అంది. 

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అనసూయ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మీకు నచ్చేసింది కదా ఈ ఫొటో. అయితే అందమైన ఫొటో పెట్టింది కదా అని రెచ్చిపోయి ..నోటి కొచ్చినట్లు కామెంట్స్ రాస్తే మాత్రం తాట తీస్తుంది. తనను ఎవరైనా విమర్శించినట్లు తెలిస్తే చాలు ఘాటుగా స్పందించి కౌంటర్లు ఇవ్వడంలో యాంకర్ అనసూయ ముందు వరుసలో ఉంటుందన్న విషయం మర్చిపోకండి.