మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవడంతో ఈ మూవీ ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇటీవల ఈ మూవీ నుండి సమంత, రామచరణ్‌ల చిట్టిబాబు, రామలక్ష్మి టీజర్‌లను విడుదల చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ’ ఇటీవల విడుదలైంది. కాగా మూవీ నుండి మరో సాంగ్‌ను విడుదల చేసేందుకు దేవీశ్రీ రెడీగా ఉన్నాడు.
 

‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ’ అంటూ పల్లె ఆడపడుచు అందచందాలను పొగితూ సాగిన ఈ పాట సంగీతప్రియుల మనసు దోచింది. ఇక రెండో సాంగ్ ‘ఎంత సక్కగున్నావే..’కు పూర్తి భిన్నంగా స్వరపరుస్తున్నాడట దేవి. ఈ సాంగ్ సుక్కూ-దేవిల స్టైల్‌లో మాస్ మసాలా దట్టించి వదులుతున్నారట. ‘రంగమ్మా.. రంగమ్మా..’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్‌లో హాట్ అండ్ బ్యూటీ ఆంటీ అనసూయ నర్తిస్తున్నట్లు సమాచారం. 
 

‘రంగస్థలం’ మూవీలో అనసూయ ఓ కీలకపాత్రలో నటిస్తుండటంతో.. ఆమె కోసం ప్రత్యేక గీతాన్ని కూడా రెడీ చేస్తుండటంతో ‘రంగమ్మా.. రంగమ్మా..’ సాంగ్‌లో అనసూయ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా మారింది. ఈ సాంగ్‌ను ఫిబ్రవరి 22న సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మైత్రీ మేకర్స్ దీనిపై అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇదిలాఉంటే మార్చి 18న ఉగాది సందర్భంగా వైజాగ్‌లో ‘రంగస్థలం’ ఆడియో వేడుకను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ‘రంగస్థలం’ విడుదల కానుంది.