హీరోయిన్ కు కార్ యాక్సిడెంట్!

Ananya Pandey Meets With a Car Accident at Student of The Year 2 Set
Highlights

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ 

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

చిత్రీకరణలో భాగంగా అనన్య పాండే కార్ డ్రైవ్ చేయాలి. అలా కారు నడుపుతున్న సమయంలో అదుపుతప్పి అక్కడే ఉన్న చెట్టుని ఢీకొన్నారు. షాక్ కు గురైన అనన్య స్పృహ కోల్పోగా.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. యాదావిదిగా ఆమె షూటింగ్ లో పాల్గోనుందని చెబుతున్నారు.  

loader