కెనడాకు చెందిన ఎమీ దర్శకుడు విజయ్ దృష్టిలో పడటం.. మదరాసు పట్టణం చిత్రంలో నటించటం లాంటివి ఆమె కూడా జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండదేమో?  కోలీవుడ్ టు బాలీవుడ్ వయా టాలీవుడ్ కు వెళ్లిన ఆమె తమిళంలోనే ఎక్కువ మూవీస్ చేసింది. అవకాశాలు వచ్చినా తమిళ చిత్రాల పట్లే తన మక్కువ ప్రదర్శించేది.

ఆమె నటించిన రోబో 2.0 చిత్రం రిలీజ్ కు దగ్గర పడుతోంది. ఇదిగో రిలీజ్ అవుతుందంటూనే.. ఏళ్లకు ఏళ్లుగా ఆ సినిమాను చెక్కేస్తున్నారు దర్శకుడు శంకర్. కొత్త సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె ఒక ఇంగ్లిషు సీరియల్ లో నటిస్తున్నారు.భారతీయ సినిమాల్లో నటించకూడదన్న నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే తాను ఆఫ్రికన్ దేశమైన మొరాకాలో సెటిల్ కావాలన్ననిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఎక్కడ కెనడా.. ఎక్కడ చెన్నై.. మరెక్కడ మొరాకో?  ఎందుకింత పెద్ద నిర్ణయం ఎమీ? అసలేమైంది..?