శ్వేతసుందరి అమీజాక్సన్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. ఎవడు తర్వాత ఈ అమ్మడు తెలుగు చిత్రంలో నటించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సుందరి ఓ బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ప్రభాస్ తాజా చిత్రం సాహోలో అమీజాక్సన్ ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కథానుగుణంగా ఎంతో ముఖ్యమైన ఈ పాత్రలో నటించడానికి అమీజాక్సన్ సుముఖత వ్యక్తం చేసిందని అంటున్నారు. ప్రస్తుతం సాహో చిత్రీకరణ జరుగుతోంది. బాహుబలి-2 అఖండ విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 

శంకర్-ఎహ్‌సాన్-లాయ్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నది. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేనివిధంగా నవ్యపంథాలో వుంటుందని చిత్ర బృందం చెబుతున్నది. దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో దుబాయ్, అబుదాబి, రొమేనియాలో పోరాట ఘట్టాల్ని చిత్రీకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో అమీజాక్సన్ నటించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.