Asianet News TeluguAsianet News Telugu

ఎమీ జాక్సన్ కూడా తాప్సీలా మాట్లాడుతోంది.. పెద్దాయన ఏమన్నాడని..

  • వివాదాస్పద వ్యాఖ్యలతో తెగ వార్తలు క్రియేట్ చేస్తున్న హిరోయిన్లు
  • రీసెంట్ గా బొడ్డుపై కొబ్బరికాయ వేయటంపై రాఘవవేంద్రరావునే తప్పుబట్టిన తాప్సి
  • బొడ్డుపై కొబ్బరికకాయ వేస్తానంటే దర్శకుడి ముఖంపై కొడతానంటున్న ఎమీ జాక్సన్
amy jackson controversial statement about coconut throw at novel

ఇటీవల పబ్లిసిటీ కోసం తమ గురువుల్లాంటి వారినే మరిచే స్థాయికి దిగజారుతున్నారు కొందరు హీరోయిన్లు. కొందరు హీరోయిన్ల కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువ గా ఉంటుందని.. హీరోయిన్లను ఐటమ్ లా చూపిస్తారని కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటారని.. నటనకు అవకాశం ఉండదని ఘాటుగానే విమర్శించారు. రీసెంట్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ తాప్సీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుపై చేసి విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

కొద్ది రోజుల క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకుంది తాప్సీ. ఝుమ్మంది నాథం సినిమాలో ఒక పాటలో ఆమె బొడ్డుపై కొబ్బరి కాయ విసరడంపై ఆమె ఈ విధంగా స్పందించారు. ఆ సినిమాలో ఓ పాటలో నా బొడ్డు మీదకు కొబ్బరికాయలు విసిరారు. అదేం శృంగారమో అర్థం కాలేదు. బొడ్డు మీదకు పూలు, పండ్లు విసరడంలో రొమాన్స్‌ ఏముందో' అంటూ మాట్లాడింది.

 

దీనిపై అటు సోషల్ మీడియాలో ఇటు సిని పరిశ్రమలో చాలా మంది ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాస్తా పరిధి దాటడంతో ఆమె స్పందించింది. రాఘవేంద్రరావుగారు, వారి కుటుంబ సభ్యులు ఆ షో చూశారు. నవ్వుతూ ఎంజాయ్‌ చేశామని వారు నాకు చెప్పారు. రాఘవేంద్రరావు గారు కూడా నా వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఇక్కడితో దాన్ని ఆపేస్తే మంచిద'ని చెప్పుకొచ్చింది. అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె మీద ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. ఆవివాదాన్ని మర్చిపోకముందే మళ్ళీ ఇంకో హీరోయిన్ కూడా అదే తరహాలో మళ్ళీ రాఘవేంద్ర రావుని విమర్శించింది.

 

పేరు ప్రస్తావించలేదు గానీ ఆ కొబ్బరి కాయను ఆ దర్శకుడి మొహమ్మీదకి విసిరేస్తానంటూ మరీ విచక్షణా రహితంగా స్పందించింది అమీ జాక్సన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీపై అలా కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు' అనే ప్రశ్న అమీకి ఎదురైంది. దీనికి స్పందించిన అమీ.. ‘ అదృష్టవశాత్తూ ఇప్పటివరకు నేను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశాను. అలా కొబ్బరికాయలు విసరడం చాలా భయంకరంగా ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు నాపై కొబ్బరికాయ విసిరితే తిరిగా వారి మొహం మీదకే విసిరేస్తాను. అందుకే నాతో ఎవరూ అలా ప్రవర్తించలేదేమో.' అని సమాధానమిచ్చింది అమీ. ‘ఎవడు’ చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన అమీజాక్సన్ ఆ తర్వాత ‘ఐ’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తుంది.

 

అయితే అమీ కమెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. హీరోయిన్లను అందంగా చూపించి వారి ఇమేజ్ మరింత పెంచేందుకు దర్శకులు ప్రయత్నిస్తుంటా ఇలాంటి చీఫ్ కామెంట్స్ చేస్తూ వారిని అవమానించడం ఎంత వరకున్యాయం అని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios