MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Water Crisis: ముంచుకొస్తున్న నీటి ముప్పు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు.. ఎందుకీ పరిస్థితి?

Hyderabad Water Crisis: ముంచుకొస్తున్న నీటి ముప్పు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు.. ఎందుకీ పరిస్థితి?

Hyderabad Water Crisis: వర్షపాతం లోటు, ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి కొరత పరిస్థితులు ముంచుకొస్తున్నాయని ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం నీటి పొదుపుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

5 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 25 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భాగ్యనగరంలో నీటి గండం.. ప్రభుత్వం ముందస్తు అలర్ట్
Image Credit : Chatgpt

భాగ్యనగరంలో నీటి గండం.. ప్రభుత్వం ముందస్తు అలర్ట్

శరవేగంగా విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పవనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఐటీ కారిడార్లతో నిండిన భాగ్యనగరంలో డిసెంబర్ నాటికి నీటి కష్టాలు మొదలవుతాయనీ, పొదుపుగా నీటిని వినియోగించాలని హైదరాబాద్ జలమండలి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

అక్టోబర్ నెల నాటికే పలు నివాస ప్రాంతాల్లో బోర్‌వెల్లు ఇంకిపోవడంతో పాటు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పుపై తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ జలమండలి (HMWSSB) పౌరులను ముందస్తుగా హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎల్ నినో ఎఫెక్ట్.. పడిపోయిన వర్షపాతం
Image Credit : Chatgpt

ఎల్ నినో ఎఫెక్ట్.. పడిపోయిన వర్షపాతం

హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా వర్షపాతం లోటు వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం చూపడంతో వాతావరణంలో అనేక మార్పులు వచ్చి, ఊహించిన స్థాయిలో రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. నగర పర్యవేక్షణ పరిధిలోని మొత్తం 46 మండలాలకు గాను ఏకంగా 45 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వడం విశేషం. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 20% నుండి 31% వరకు తీవ్ర కొరత ఏర్పడటంతో నగరానికి నీరందించే ప్రధాన జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం రాకుండా పోయింది.

Appeal To All Citizens Of Hyderabad by @MDHMWSSB

#HMWSSB #SaveWater #WaterConservation #StopWaterWastage #EveryDropCounts #UseWaterResponsibly #WaterSecurity #Hyderabad #JubileeHills #WaterAwareness #PreventWaterLoss #FixLeaks #SaveWaterSaveFuture #ResponsibleWaterUse #WaterIsPrecious #HyderabadWater #PublicAwareness #WaterManagement

— HMWSSB (@HMWSSBOnline) September 22, 2026

35
బోర్లు ఎండిపోతున్నాయి.. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి
Image Credit : Getty

బోర్లు ఎండిపోతున్నాయి.. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి

వర్షాలు తగ్గడానికి తోడు, రోజువారీ అవసరాల కోసం అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ సముదాయాల్లో పరిమితి లేకుండా బోర్లు వేయడం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే నగర సగటు భూగర్భ జలమట్టం ఏకంగా 5 మీటర్ల మేర దిగువకు పడిపోయింది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, తిరుమలగిరి, మారేడ్‌పల్లి వంటి ఏరియాల్లో నీటిమట్టం 30 నుండి 40 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. నగరానికి సంబంధించిన వార్షిక భూగర్భ జల నిల్వల్లో దాదాపు 70 శాతం నీరు ఎండాకాలం ప్రారంభానికి ముందే ఖాళీ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

45
కాంక్రీట్ జంగిల్‌గా నగరం.. ప్రాజెక్టులపై పెరుగుతున్న ఒత్తిడి
Image Credit : Gemini AI

కాంక్రీట్ జంగిల్‌గా నగరం.. ప్రాజెక్టులపై పెరుగుతున్న ఒత్తిడి

నగరం వేగంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో సహజ నీటి నిల్వ ప్రాంతాలైన చెరువులు, కుంటలు మాయమై కాంక్రీట్ మయమయ్యాయి. దీనివల్ల పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక డ్రైనేజీల పాలవుతోంది. మరోవైపు నగరానికి దాహార్తి తీర్చే సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. జలమండలి అధికారులు కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల ద్వారా సరఫరాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ - సప్లై వ్యత్యాసాన్ని భర్తీ చేయడం పెద్ద సవాలుగా మారింది. ఇలా అన్ని అంశాలు హైదరాబాద్ లో నీటి లభ్యత పై ప్రభావం చూపిస్తున్నాయి.

55
నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం.. జలమండలి ప్లాన్
Image Credit : our own

నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం.. జలమండలి ప్లాన్

పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం, జలమండలి రంగంలోకి దిగాయి..

• ఇంకుడు గుంతలు తప్పనిసరి: కాలనీలు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది.

• ట్యాంకర్ల సరఫరా స్పందన: రాబోయే పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బోర్లు ఎండిపోయిన ప్రాంతాలకు తాగునీటి ట్యాంకర్ సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు.

• నీటి పొదుపు నిబంధనలు: వాహనాలు కడగడం, గార్డెనింగ్ వంటి పనులకు మంచినీటిని వృథా చేయకుండా ఆంక్షలు విధించడమే కాకుండా, పౌరులు స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నాయి.

• ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలనీ, రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరవాసులను, తెలంగాణ రైతాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.

నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు

=========================================

# గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ

# నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, గ్రీనరీ అవసరాలకు శుద్ధి చేసిన నీరు

# భూగర్భ జలాల పరిరక్షణ, తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం

# ట్యాంకర్లకు ప్రత్యేక బ్రాండింగ్, జీపీఎస్.. ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ-పోస్ యంత్రాలు

# బుకింగ్ నుంచి డెలివరీ వరకు పర్యవేక్షణకు ప్రత్యేక ఆన్‌లైన్ వేదిక

# నవంబర్ 1 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి: జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భూగర్భ జలాల పరిరక్షణతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, గ్రీనరీ, ఇతర తాగునీరు అవసరం లేని పనులకు వినియోగించేలా నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

రానున్న ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగాన్ని పెంచేందుకు చేపడుతున్న చర్యలపై శుక్రవారం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రీన్ వాటర్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్యాంకర్ల నమోదు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్లు:

నిర్మాణ రంగం, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో శుద్ధి చేసిన నీటికి ఉన్న డిమాండ్‌ను ప్రాంతాలవారీగా అంచనా వేయాలని ఎండీ సూచించారు. అందుకు అనుగుణంగా సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎస్టీపీలను గుర్తించి గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫిల్లింగ్ పాయింట్లు, ప్లాట్‌ఫారాలు, పంపింగ్ సదుపాయాలు, ఫ్లో మీటర్లు, ఇతర మౌలిక వసతులను సమకూర్చాలని పేర్కొన్నారు.

ట్యాంకర్లకు ప్రత్యేక బ్రాండింగ్.. జీపీఎస్ తప్పనిసరి:

గ్రీన్ వాటర్ సరఫరాలో పారదర్శకత ఉండేలా ప్రతి ట్యాంకర్‌కు ప్రత్యేక బ్రాండింగ్‌తో పాటు జీపీఎస్ పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ల కదలికలు, సరఫరా సమయాలు, డెలివరీ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటు చేసి, ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణం, బుకింగ్, సరఫరా వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

బుకింగ్ నుంచి డెలివరీ వరకు ఆన్‌లైన్ పర్యవేక్షణ:

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నమోదు, వినియోగదారుల రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ బుకింగ్, ట్యాంకర్ కేటాయింపు, జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, డెలివరీ నిర్ధారణ వంటి సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేయాలని ఎండీ సూచించారు.

సొంత ట్యాంకర్లు కలిగిన వినియోగదారులు కూడా నిర్దేశిత నిబంధనల మేరకు ఈ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ట్యాంకర్లు లేని వినియోగదారులకు జలమండలిలో నమోదైన ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం:

నిర్మాణ పనులు, మొక్కల పెంపకం, పార్కుల నిర్వహణ, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ వంటి అవసరాలకు తాగునీరు, భూగర్భ జలాలను వినియోగించకుండా శుద్ధి చేసిన నీటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎండీ సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, పారిశ్రామిక సంఘాలతో సమన్వయం చేసుకొని గ్రీన్ వాటర్ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు.

నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ:

గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లలో శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని ఎండీ ఆదేశించారు. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, శుద్ధి చేసిన నీటిని తాగునీరు అవసరం లేని పనులకు మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రీన్ వాటర్ వినియోగంపై విస్తృత ప్రచారం:

గ్రీన్ వాటర్ సేవలపై నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఎండీ సూచించారు. బుకింగ్ విధానం, ఫిల్లింగ్ స్టేషన్ల వివరాలు, శుద్ధి చేసిన నీటి వినియోగ ప్రయోజనాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక, నిర్వహణ ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మూడు రీజియన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, డైరెక్టర్లు నారాయణ, వాసా సత్యనారాయణ, కిరణ్ కుమార్, వివిధ విభాగాల చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

— HMWSSB (@HMWSSBOnline) October 23, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Papaya Farming: ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న పండు ఇదే.. ఇలా సాగు చేస్తే కాసుల వర్షమే!
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
Recommended image3
Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీలో కాదు తెలంగాణలోనూ వర్షబీభత్సమే, ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు
Recommended image2
Papaya Farming: ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న పండు ఇదే.. ఇలా సాగు చేస్తే కాసుల వర్షమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved