బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ” థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ” చిత్రంలోని ఆయన లుక్స్ సెట్స్ నుంచి లీకయ్యాయి. ఈ మూవీలో హీరో ఆమిర్ ఖాన్ కాగా బిగ్ బీది ఓ కీలక పాత్ర. ఈ సినిమాకోసం ఆయన అతి బరువైన ” సూట్ “(కాస్ట్యూమ్) ధరించిన కారణంగానే ఆయన చాలా ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్ లోని జోద్ పూర్ లో జరుగుతోంది.

అటు-మరో లుక్ లో ఓ భారీ తలపాగాతో ఓ కన్ను మూసుకుపోగా..ముడుతలు పడిన ముఖంతో 90 ఏళ్ళ వృద్ధుడిలా కనిపిస్తున్న అమితాబ్ స్టిల్ కూడా లీకయింది. అయితే ఇది నిజంగా బిగ్ బీదేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ కి సంబంధించి రెండో పిక్ ఫేక్ అని,  ఆఫ్ఘనిస్తాన్‌లోని 68ఏళ్ల షాబుజ్ అనే శరణార్థిదని తేలింది. అమితాబ్ పోలికలతో వుండడంతో ఈ ఫోటో వైరల్ అయ్యింది.

ఇక ఈ చిత్రం సెట్స్ నుంచే ఆమిర్ ఖాన్ కు సంబంధించిన మరో లుక్ కూడా లీక్ కావడం విశేషం. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఈ మూవీకి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తుండగా..ఆదిత్య చోప్రా నిర్మాత.