బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్....ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. భారత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలో అయేది అమితాబ్ నే. 2017కు గాను ఎక్కువమంది ఫాలోవర్లున్న సెలబ్రిటీలలో మోదీ మొదటి స్థానంలోనూ బిగ్ బీ రెండో స్థానంలోనూ ఉన్నారు. అమితాబ్ కు ట్విట్లర్లో దాదాపు 32.90 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కొద్ది రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కూడా అమితాబ్ కు తనకన్నా 30 లక్షల మంది ఫాలోవర్లు అధికంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.  అయితే 3 రోజుల క్రితం తాను ట్విట్టర్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నా అంటూ...బిగ్ బీ సరదాగా ఓ ట్వీట్ చేశారు. నా ఫాలోవర్స్ ను తగ్గించాలని చూస్తున్నావా.....ట్విట్టర్ అంటూ ఆ సంస్థపై సెటైర్ వేశారు అమితాబ్. ఇంతమంది ఫాలోవర్లున్న బిగ్ బీని ఈ తరం హీరో హీరోయిన్లు - నటీనటులు ఫాలో అవడంలో పెద్ద వింతేమీలేదు. అయితే ఆశ్చర్యకరంగా అమితాబ్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కమెడియన్ వెన్నెల కిశోర్ కు షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరినీ బిగ్ బీ ఫాలో అవుతుండడంతో వారిద్దరూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

రకుల్  - వెన్నెల కిశోర్ ల కు అమితాబ్ షాక్ ఇచ్చారు. బిగ్ బీ తమను ఫాలో అవుతున్నట్లు వారికి నోటిఫికేషన్లు రావడంతో వారు బాగా ఎగ్జయిట్ అయ్యారు. దీంతో తనను ఫాలో అవుతున్నందుకు బిగ్ బీకి ధన్యవాదాలు తెలుపుతూ రకుల్ ట్వీట్ చేసింది. ఈ విషయంపై ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావట్లేదని రకుల్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. తనకు వచ్చిన నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ ను వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు. తను గుండె దడగా ఉందంటూ ట్వీట్ చేశాడు. వీరిద్దరే కాకుండా మరికొందరు టాలీవుడ్ నటులను కూడా బిగ్ బీ ఫాలో అవుతున్నట్లు వినికిడి. మరి వారు కూడా రకుల్ - వెన్నెల కిశోర్ ల మాదిరిగా ట్వీట్ చేస్తే కానీ ఆ సంగతి పై ఓ క్లారిటీ రాదు.