భారత చలన చిత్ర పరిశ్రమలో ఫిబ్రవరి 24, 2018 తేదీ ఓ కాళరాత్రిగా మిగిలిపోయింది. ఐదు దశాబ్దాలుగా వెండితెరపై మెరుపులు మెరిపించి విశేష అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి ఇకలేరనే వార్త అందర్నీ దుఖ: సాగరంలో ముంచేసింది. దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్రూం టబ్‌లో మునిగి చనిపోయారనే వార్తపై మీడియా పలు విధాలుగా సందేహాలను వ్యక్తం చేసింది. అయితే బాత్రూ టబ్‌లో శ్రీదేవి మరణం ఇలా జరిగి ఉంటుంది అని అమీర్‌ఖాన్ చెప్పిన విషయాలతో భర్త బోనీకపూర్ వెక్కివెక్కి ఏడ్చారట.

 

శ్రీదేవి మరణించిందనే వార్తతో అందరి మాదిరిగానే అమీర్‌ఖాన్ దిగ్భ్రాంతికి లోనయ్యారట. వార్త విన్న సమయంలో అమీర్ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ఉన్నారట. ఆ తర్వాత బోనికి ఫోన్ చేసి బాధను పంచుకొనే ప్రయత్నం చేశారట. అయితే బాధలో ఉన్న బోని ఫోన్‌లో అందుబాటులోకి రాలేదట. శ్రీదేవి అంత్యక్రియల తర్వాత మార్చి 3వ తేదీన బోనికపూర్‌కు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని ఆ సందర్భంగా గుర్తు చేసుకొన్నారట. ముంబై చేరుకోగానే నేరుగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి వచ్చి కలుస్తాను అని మాటిచ్చారు.

 

బోనితో టెలిఫోన్‌లో మాట్లాడే సందర్భంగా బాత్రూంలో తన స్నేహితుడు భార్య ప్రమాదానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు. తన క్లోజ్ ఫ్రెండ్ హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆ సందర్భంగా తన భార్య స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. అయితే ఏదో అనుమానం వచ్చి భర్త బాత్రూంలోకి వెళ్లగానే ఆమె టబ్‌లో మునిగిపోయింది. దాంతో తన స్నేహితుడు షాక్‌కు లోనయ్యాడు. బాత్‌టబ్‌లో మునిగిన తన భార్య ముక్కు వరకు మునిగి అపాస్మరక స్థితిలో ఉండటం గమనించాడు. ఆమె పేరు పెట్టి విలువగా కళ్లు తేలేసి.. మూలుగుతూ కనిపించింది. దాంతో ఏదో ప్రమాదంలో తన భార్య ఇరుక్కొన్నదని గమనించిన భర్త వెంటనే ఆమెను బయటకు లాగాడు. ఏం జరిగిందో తెలియని.. మగతగా ఉన్న ఆమెను నిలబెట్టేందుకు ప్రయత్నించగా ఆమె నిలబడలేకపోయింది. అప్పుడు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. దాంతో ఆమెను బోర్లా పడుకోబెట్టి నా స్నేహితుడు సపర్యలు చేశాడు. దాంతో ఆమె పరిస్థితి మెరుగపడింది. ఆ తర్వాత వారు వైద్యుడిని సంప్రదించడం జరిగింది.

 

అలా అమీర్ చెబుతుండగా.. ఇంతకీ ఆమెకు ఏమైంది అని బోని అడిగారట. బోని ప్రశ్నకు అమీర్ సమాధానం ఇస్తూ.. నా స్నేహితుడి భార్య లో బ్లడ్ ప్రెజర్‌తో బాధపడుతుంది. ఆ సమయంలో టబ్‌లోని వేడినీళ్లలో తల వరకు మునిగింది. దాంతో ఆమె బ్లడ్ ప్రెజర్ మరింత డౌన్ అయింది. లో బీపీ కారణంగా ఆ సమయంలో నా స్నేహితుడి భార్య తలలోని రక్తం దేహంలోని ఇతర ప్రాంతాలకు చేరింది. దాంతో ఆమె వెంటనే మత్తులోకి జారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత డాక్టర్ వారికి చెప్పిందేమిటంటే.. లో బ్లడ్ ప్రెజర్ కారణంగా తలలోని రక్తం దేహానికి సరఫరా కావడంతో స్పృహ కోల్పోతారు. దాంతో టబ్‌లో మునిగిపోయి చనిపోవడానికి కారణం అవుతుంది అని చెప్పారు.

 

అమీర్ చెప్పిన విషయాలను విన్న బోనికపూర్.. శ్రీదేవిని తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చాడట. శ్రీదేవి కూడా అలానే మునిగి చనిపోవచ్చని చిన్న పిల్లాడిలా విలపించాడట. ఒకవేళ నేను కూడా సరైన సమయంలో స్పందించి ఉంటే శ్రీదేవి మరణించేది కాదు అని దు:ఖంలో మునిగిపోయారట.

 

అమీర్ చెప్పినట్టుగానే మార్చి 4వ తేదీన లాస్ ఎంజెలెస్ నుంచి ముంబైకి చేరుకోగానే నేరుగా విమానాశ్రయం నుంచి వెళ్లి బోనిని కలిశారు. శ్రీదేవి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోనిని ధైర్యంగా ఉండాలని, అలాగే జాహ్నవి, ఖుషీలను జాగ్రత్తగా చూసుకోవాలని అమీర్ సూచించారట.