అందాల తతార శ్రీదేవి మృతిపై నెలకొ1న్న అనుమానాల నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మృతదేహాన్ని సోమవారం అప్పగిస్తారనుకుంటే.. ప్రాసిక్యూషన్ ఇచ్చిన ట్విస్ట్ తో... శ్రీదేవి మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్నాయి. శ్రీదేవి మృతదేహం అప్పగించేందుకు మరింత సమయం పడుతుందని దుబయి మీడియా వెల్లడించింది.

 

బోనీకపూర్ ను కూడా విచారిస్తున్న ప్రాసిక్యూషన్ అనుమానాల నేపథ్యంలో.. హోటల్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. బాత్ టబ్ లో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిందన్న పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో విబేధించిన ప్రాసిక్యూషన్ విచారణ మరింత లోతుగా జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విచారణ మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.

 

మరోవైపు శ్రీదేవి ఆల్కహాల్ తీసుకుందని అంటున్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో నీటిలో మునిగిపోయి చనిపోయిందని చెప్తున్నారు. కేవలం వైన్ మాత్రమే తీసుకునే శ్రీదేవి.. లిక్కర్ ఎందుకు తీసుకుంది. అసలు తీసుకుందా లేదా... తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకుంది.. ఇవన్నీ విచారణ చేశాకే తదుపరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అంతే కాక శ్రీదేవికి మద్యం అలవాటు లేదని, శ్రీదేవి కేవలం వైన్ తీసుకుంటారని ఆమెకు సన్నిహితులైన సీనియర్ రాజకీయ నేత అమర్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.