Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో సినీ టూరిజం.. ముఖ్యమంత్రితో బాలయ్య ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని, దీనికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

Amaravati to be centre of cine tourism soon says chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని, దీనికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్, హీరో దగ్గుబాటి రానా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇవే సినీ పరిశ్రమకు చాలా ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

కొత్త రాజధాని అమరావతితో పాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు అన్నారు. అందుకు తగ్గట్లుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడతాయని సినీ దర్శకులు క్రిష్, హీరో రానా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూస్తే సినీ టూరిజం అనే కొత్త తరహా ఆకర్షణకు కూడా ప్రముఖంగా ప్రోత్సహించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తాము కూడా తగు సహకారం అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణ విశేషాలను కూడా నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రికి వివరించారు. 

Amaravati to be centre of cine tourism soon says chandrababu naidu
 

Follow Us:
Download App:
  • android
  • ios