విడాకులు తీసుకున్నప్పటికీ మాజీ భర్తపై ప్రేమ‌ను చూపిస్తున్న అమ‌ల‌పాల్ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ‌ల‌పాల్ విజయ్‌ తల్లిదండ్రులు పెట్టిన ఆంక్షల విడాకులు తీసుకున్న ముద్దుగుమ్మ
విజయ్ తల్లిదండ్రులు పెట్టిన ఆంక్షల వల్లే అమలా పాల్ విడాకులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. వేరుపడిన తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. దర్శకుడిగా విజయ్, హీరోయిన్గా అమలా పాల్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.
ఈ క్రమంలో విజయ్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తే మీరు చేస్తారా. అనే ప్రశ్న అమలా పాల్ ముందుంచితే – జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమాల్లో నటించడం తప్ప ఇతర విషయాల గురించి నేను ఆలోచించడం లేదు. మేమొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. ఈ జీవిత ప్రయాణంలో మన దరికి వచ్చిన అంశాలను, అవకాశాలను అంగీకరించి ముందుకు వెళ్లాలి’’ అన్నారామె. దీనర్థం... విజయ్ నుంచి వ్యక్తిగతంగా మాత్రమే విడిపోయాననీ, వృత్తిపరమైన సంబంధాలు కొనసాగుతాయని అమలా పాల్ చెబుతున్నారని ఊహించవచ్చు.
