లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సీనియర్ నటుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాత వింటా నందా ప్రముఖ నటుడు అలోక్ నాథ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది.

ఇరవై ఏళ్ల క్రితం అలోక్ నాథ్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెండు దశాబ్దాల క్రితం వింటా నందా 'తారా' అనే సీరియల్ నిర్మించింది. ఇందులో అలోక్ నాథ్ కీలకపాత్ర పోషించాడు.

ఆ సమయంలో అలోక్ నాథ్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అక్టోబర్ 17న పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుండి అలోక్ నాథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శుక్రవారం నాడు ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు.. 

సీనియర్ నటుడిపై రేప్ కేసు నమోదు!

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!