అల్లు శిరీష్ ఒక్క క్షణం మేటరేంటో టీజర్ చూస్తే తెలుస్తుంది

allu sirish okka kshanam teaser out
Highlights

  • అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న ఒక్క క్షణం మూవీ
  • డిసెంబర్ 23న ఒక్క క్షణం చిత్రం విడుదలకు ఏర్పాట్లు
  • సినిమాలో మేటర్ వుందని స్పష్టం చేస్తున్న టీజర్

అల్లు శిరీష్ నటిస్తున్ న్యూ మూవీ 'ఒక్కక్షణం'. ఆదివారం టీజర్ విడుదలైంది. “నేను ప్రేమించిన అమ్మాయిన ప్రాణాల మీదకు వస్తే ఫేట్ తో అయినా, డెస్టెనీతో అయినా, చివరకు చావుతో అయినా పోరాడతాను” అంటూ... ఇప్పటి వరకు వచ్చిన అల్లు శిరీష్ సినిమాలన్నింటికంటే ఈ సినిమా  చాలా బావుంటుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

 

‘ఒక్క క్షణం' చిత్రానికి ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్‌కి జోడీగా సురభి, సీరత్‌ కపూర్‌ నటిస్తున్నారు. శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలో నటిస్తున్నారు. చక్రి చిగురిపాటి నిర్మాత లక్ష్మి నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

 

అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, ర‌వి వ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌ణ‌వ్‌, బద్రం త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషించారు.

 

ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్ - సతీష్ వేగేశ్న, రాజేష్ దండ, సంగీతం – మణిశర్మ, డిఓపి - శ్యామ్ కె నాయిడు, డైలాగ్స్ - అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ జి, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ - నాగేంద్ర ప్రసాద్, క్రియేటివ్ హెడ్ - సంపత్ కుమార్, కో డైరెక్టర్ అండ్ అడిష‌న‌ల్ డైలాగ్స్‌ - విజయ్ కామిశెట్టి, బ్యానర్ - లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్, నిర్మాత - చక్రి చిగురు పాటి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - విఐ ఆనంద్.

loader