మెగా హీరో సినిమా అంటే.. మెగా ఫ్యామిలీ మొత్తం కదిలిరావాల్సిందే. ఒకటిరెండు మినహాయింపులు తప్పకపోవచ్చు. మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబం నుంచి కూడా ఆ సినిమాకు బాసట ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో చెర్రీ -సుక్కు ‘రంగస్థలం’ ఫీవర్ నడుస్తోంది. వైజాగ్ ఆర్కే బీచ్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తో ‘రంగస్థలం’ మూవీ ప్రమోషన్ పీక్స్‌లోకెళ్ళిపోయింది. ‘రంగస్థలం’ మేకింగ్ వీడియో, అందులో చరణ్ వర్కింగ్ స్టైల్ ఫ్యాన్స్ కి లేటెస్ట్ హాటెస్ట్ ఎలిమెంట్స్. ఇదిలా ఉంటే.. చరణ్ ఫ్యాన్ క్లబ్ లో కొత్తగా ఓ ‘కుర్రాడు’ చేరిపోయాడు. బన్నీ కొడుకు అయాన్.. చరణ్ మామయ్య సినిమా కోసం నేను సైతం అంటూ ప్రమోషన్ అందుకున్నాడు. అడ్డ లుంగీ, గళ్ళ చొక్కా, చేతిలో తువ్వాలు.. టోటల్ గా రంగస్థలంలో చిట్టిబాబుగా చెర్రీ గెటప్. దీన్ని తానూ వర్కవుట్ చేసి.. సోషల్ మీడియాకెక్కేశాడు అల్లు అయాన్.