మగధీర 2కు అల్లు అరవింద్ స్కెచ్.. రాజమౌళి గ్రీన్ సిగ్నల్?

allu arvind plans for magadheera2 with ss rajamouli
Highlights

  • బాహుబలి బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి ఇండస్ట్రీ హిట్ పై దృష్టి పెట్టిన నిర్మాత అల్లు అరవింద్
  • గతంలో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర
  • ఇప్పుడు బాహుబలి హిట్ తో హీటుపెరిగి మగధీర2 తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లాన్స్

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం వెయ్యు కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచింది. బాహుబలి పార్ట్ వన్ విడుదలైనప్పుడు తెలుగు సినిమాకు బాహుబలి మినహా రికార్డులే తప్ప మించి రికార్డు లేదు. ఇక ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 రిలీజయ్యాక భారతీయ సినిమాలకు.. అంటే బాలీవుడ్ సినిమా అయినా సరే.. బాహుబలి2 సాధించిన కలెక్షన్స్ బెంచ్ మార్క్ గా నిలిచాయి.

 

బాహుబలి పార్ట్1, పార్ట్ 2లు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు నమోదు చేస్తున్నాయో తెలిసిందే. వెయ్యు కోట్లు కలెక్షన్లు దాటినా, రెండు వీకెండ్స్ గడిచినా,.. ఇంకా బాక్సాఫీస్ వద్ద బాహుబలికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా బాహుబలి ఖ్యాతి రోజురోజుకూ ఖండాంతరాలు దాటుతోంది. ఇప్పుడు అదే క్రేజ్ తో దర్శక ధీరుడు రాజమౌళి గతంలో ఆ రోజుకు ఇండస్ట్రీ హిట్ గా తెరకెక్కించిన మగధీర నిర్మాత అల్లు అరవింద్ ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

 

మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన రాజమౌళి ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి చిత్రంలో దేశంలోనే సినిమా రంగానికి ఓ దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఈ క్రేజ్ దృష్ట్యా... బాహుబలి సక్సెస్ సాధించిన తీరుగానే మరో సినిమాను నిర్మించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే మగధీర 2 నిర్మించాలని భావిస్తున్నారని,  అరవింద్ కోరిక మేరకు రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే కథ కూడా పూర్తి చేశారని సమాచారం.

 

ఇక రామ్ చరణ్ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తర్వాత మరే మూవీకి కమిట్ కాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాలో నటించాలని మామ అల్లు అరవింద్ కూడా క్లారిటీ తీసుకున్నారని సమాచారం.

 

అల్లు అరవింద్ మరోసారి మగధీర 2 తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాలని ఆశపడటంలో తప్పులేదు. కానీ రాజమౌలి దీని గురించి ఏం ఆలోచిస్తున్నారో అన్నది ప్రస్థుతానికి సస్పెన్స్ గానే ఉంది. కొన్ని రోజుల సెలవుల తర్వాతే రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్ట్ ఏంటి ఎప్పుడు ఎలా అనేది వెల్లడించనున్న నేపథ్యంలో.. మగధీర2 ప్రాజెక్ట్ గనుక నిజమే అయితే మరో సంచలనానికి తెరలేపినట్లే.

loader