అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దీంతోపాటు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ, సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీ, సంజయ్ లీలా భన్సాలీతో, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్‌తోనూ సినిమాలు చేయాల్సి ఉంది.
ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఓ క్రేజీ దర్శకుడితో మూవీ చేయబోతున్నారు బన్నీ. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో మూవీకి కమిట్ అయినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు?
అల్లు అర్జున్ సినిమాకి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. అట్లీ సినిమా తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమాలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని సమాచారం.
బాసిల్ జోసెఫ్ మలయాళ దర్శకుడు. ఆయన గతంలో `మిన్నల్ మురళీ` తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు నటుడిగా కూడా రాణిస్తున్నారు. శివకార్తికేయన్ `పరాశక్తి`లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ కూడా కన్ఫమ్ అయినట్టు సమాచారం. దీనికి `శక్తిమాన్` అనే పేరుని పరిశీలిస్తున్నారట. అట్లీ మూవీ తర్వాత ఇదే స్టార్ట్ అవుతుందని టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

VFX కోసం 250 కోట్లు
అల్లు అర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా అయిన AA22xA06ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఫాంటసీ కథగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి యానిమేషన్ పాత్ర అని తెలుస్తుంది.
`జవాన్` లాంటి హిట్ సినిమాలు తీసిన అట్లీ, `పుష్ప2` హీరో కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.700 కోట్లు ఉంటుందని టాక్. అందులో అల్లు అర్జున్‌కి రెండు వందల కోట్ల పారితోషికం, దర్శకుడు అట్లీకి వంద కోట్లు ఇస్తున్నారట. ఇక వీఎఫ్‌ఎక్స్ కే రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ మూవీ 80శాతం సెట్‌లో ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది.
