- Home
- Entertainment
- `హరిహర వీరమల్లు` ఓటీటీ, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు.. నిర్మాత ఇప్పటికే సేఫ్, కానీ అదే ట్విస్ట్
`హరిహర వీరమల్లు` ఓటీటీ, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు.. నిర్మాత ఇప్పటికే సేఫ్, కానీ అదే ట్విస్ట్
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. మరి ఎంతకు అమ్ముడు పోయిందో చూస్తే..

`హరిహర వీరమల్లు` వాయిదాకి కారణం
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ బిజినెస్‌కి సంబంధించిన డీల్స్ సెటిల్ కాకపోవడం వల్ల వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇందులో మరో కోణం వినిపిస్తోంది.
`హరిహర వీరమల్లు` ఓటీటీ, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు
`హరిహరవీరమల్లు` మూవీ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం భారీ రేట్‌కే బిజినెస్ జరిగిందట. ఓ రకంగా నిర్మాత సేఫ్‌లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఓటీటీ డీల్ అమెజాన్ ప్రైమ్‌తో జరిగింది.
సుమారు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఓటీటీ బిజినెస్ అయ్యిందని సమాచారం. మరోవైపు థియేట్రికల్‌గా ఈ మూవీకి రూ. 150కోట్ల వరకు బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది.
ఓటీటీ డీల్‌లో కొత్త చిక్కు
కాకపోతే సినిమా వాయిదా పడటం వల్ల ఈబిజినెస్‌కి సంబంధించిన చిక్కులు వచ్చాయట. జూన్ 12న సినిమా విడుదలైతే అన్నీ సాఫీగా జరిగేవి, నిర్మాత సేఫ్‌లోనే ఉండేవారు. కానీ వాయిదా పడటం వల్ల అమెజాన్ ప్రైమ్ కొత్త డేట్ ఇవ్వడానికి టైమ్ పడుతుందట.
సినిమా వాయిదా పడటంతో ఓటీటీ రిలీజ్‌కి ఇబ్బంది ఏర్పడిందని, అమెజాన్ వాళ్లు కొంత అమౌంట్‌ని తగ్గించే ఆలోచనలో ఉన్నారని, ఇదే ఇప్పుడు సమస్యగా మారిందని అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాకపోవడానికి కారణం ఇదే అని తెలుస్తోంది.
నిర్మాతపై ఒత్తిడి తెస్తున్న బయ్యర్లు
ఇంకోవైపు `హరిహర వీరమల్లు` మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. సుమారు రూ. 150కోట్ల వరకు అయ్యిందని సమాచారం. అయితే ఇప్పుడు సినిమా వాయిదా పడటంతో బయ్యర్లు కూడా నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారని, రేట్లు తగ్గించాలనే ప్రెజర్ పెంచుతున్నారని టాక్.
ఇది కూడా నిర్మాతకు కొత్త తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇవన్నీ సెటిల్ చేసుకుని `హరిహర వీరమల్లు` సినిమా బయటకు రావాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే పవన్ రంగంలోకి దిగాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.
రూ.200కోట్ల బడ్జెట్‌తో `హరిహర వీరమల్లు`
ఇదిలా ఉంటే `హరిహర వీరమల్లు` మూవీ ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. సుమారు రూ.150కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకు అది బాగా పెరిగిందని, ఫైనల్‌గా రూ.200కోట్లు దాటిందని తెలుస్తుంది.
ఇందులో వడ్డీలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అంతిమంగా సినిమా ఔట్‌పుట్ బాగానే వచ్చిందని తెలుస్తోంది. సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఈ మూవీ రేంజ్‌ని ఊహించడమే కష్టమే అని టాక్.
మరి ఈ మూవీ ఎంత వరకు ఆడియెన్స్ కి రీచ్ అవుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతికృష్ణ దర్శకుడిగా రూపొందిన ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.