Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌ ట్విస్ట్ః బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరోసారి సినిమా.. మహేష్‌ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కాబోతుందనే హింట్‌ ఇచ్చారని అంటున్నారు నెటిజన్లు. `అల వైకుంఠపురములో2` రాబోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌.. మహేష్‌బాబుతో ఓ సినిమాని ప్రకటించారు. 

allu arjun trivikram combination once again mahesh-trivikram movie selved?
Author
Hyderabad, First Published Oct 28, 2021, 5:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivkram) కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి. `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో`. ఈ మూడు బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. గతేడాది వచ్చిన `అల వైకుంఠపురములో` చిత్రం ఏకంగా నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసింది. గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మహేష్‌ బాబు సినిమా `సరిలేరు నీకెవ్వరు`ని ఢీ కొట్టి మరీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఓ సింపుల్‌ స్టోరీ, క్లీన్‌ నెరేషన్‌తో, ఎంటర్‌టైనింగ్‌గా సాగిన ఈ సినిమా యావత్‌ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇందులోని పాటలు రికార్డ్ వ్యూస్‌తో టాప్‌ చార్ట్ బస్టర్‌లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. తాజాగా నిర్మాత నాగవంశీ పంచుకున్న పోస్ట్ ఇప్పుడు ఆద్యంతం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అదే సమయంలో మరోసారి, అంటే ముచ్చటగా నాల్గోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే విషయాన్ని భీజం పోస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్‌ నాగవంశీ.. సంగీత దర్శకుడు థమన్‌, ఐకాన్ స్టార్‌ Allu Arjun, దర్శకుడు Trivkram, తాను కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశాడు. ఇందులో ఓ బిగ్‌ సర్‌ప్రైజ్‌ కమ్మింగ్‌ సూన్‌ అని పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఇందులో హారికా అండ్‌ హాసిని నిర్మాణ సంస్థని ట్యాగ్‌ చేశాడు. 

దీంతో కచ్చితంగా ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కాబోతుందనే హింట్‌ ఇచ్చారని అంటున్నారు నెటిజన్లు. `అల వైకుంఠపురములో2` రాబోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌.. MaheshBabuతో ఓ సినిమాని ప్రకటించారు. ఇది పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.  ఈ ఇయర్‌ ఎండింగ్‌లో ఉంటుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అనేక అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే టాక్‌ కూడా వస్తోంది. మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా ఆగిపోయిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

అయితే మహేష్‌తో సినిమా ఆగిపోయిందని, దీంతో మళ్లీ బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. అందులో భాగంగా `వరుడు కావలెను` ఈవెంట్లో సర్‌ప్రైజింగ్‌ గా త్రివిక్రమ్‌ మెరిశారు. ఆయన బన్నీ కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చారనే టాక్‌ కూడా జరుగుతుంది. అదే సమయంలో వీరిద్దరు చాలా సందర్భాల్లో డీప్‌ డిస్కషన్‌లో పాల్గొన్నారు. దీంతో అప్పుడే తమకు డౌట్‌ వస్తుందని, వీరిద్దరి మధ్య నెక్ట్స్ ఏదో ప్లాన్‌ జరుగుతుందనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. అందుకు బలాన్నీ చేకూర్చుతూ నిర్మాత నాగవంశీ సర్‌ప్రైజ్‌ అంటూ వీరి ఫోటోని పంచుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

also read: వాళ్ళిద్దరి ఇష్టం తెలుసుకుని,ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేస్తాం.. దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ తల్లి సంచలనం

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అతడు`, `ఖలేజా` వచ్చాయి. చాలా గ్యాప్‌తో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. కానీ చూడబోతే ఈ సినిమా ఆగిపోయే అవకాశాలున్నాయని ఈ లేటెస్ట్ అప్‌డేట్‌ ని బట్టి అర్థమవుతుంది. మరి ఇందులో నిజమెంతో చూడాలి. బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. దీని తర్వాత `ఐకాన్‌` చిత్రం చేయనున్నారు. అలాగే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు ప్రశాంత్‌ నీత్‌తో, అలాగే ఏ.ఎఆర్‌ మురుగదాస్‌తోనూ సినిమాలు చేయనున్నట్టు సమాచారం. మరి ఇందులో ఏది ఎప్పుడు పట్టాలెక్కుతుంది. ఈ గ్యాప్‌లో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. 

also read: 'సామీ సామీ'.. కిక్కిచ్చే నాటు సాంగ్ ఇదిగో.. బి, సి సెంటర్స్ దుమ్ము దుమారమే!

Follow Us:
Download App:
  • android
  • ios